Jaggery: బెల్లం తయారీలో కల్తీ జరిగిందా.. ఈ సింపుల్ టిప్స్ తో ప్యూరిటీ చెక్ చేసుకోండి..

తీపి పదార్థాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ.. షుగర్ తో తయారయ్యే పదార్థాలు, మిఠాయిలను ఎక్కువగా తీసుకోవడం వల్ల తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా.. మున్ముందు తీవ్ర..

Jaggery: బెల్లం తయారీలో కల్తీ జరిగిందా.. ఈ సింపుల్ టిప్స్ తో ప్యూరిటీ చెక్ చేసుకోండి..
Jaggery

Updated on: Feb 11, 2023 | 7:52 PM

తీపి పదార్థాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ.. షుగర్ తో తయారయ్యే పదార్థాలు, మిఠాయిలను ఎక్కువగా తీసుకోవడం వల్ల తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా.. మున్ముందు తీవ్ర సమస్యలు కలిగిస్తాయి. పంచదార తో కలిగే అనర్థాల కారణంగా చక్కెర స్థానంలో బెల్లం ఉపయోగించడం స్టార్ట్ చేశారు. రోజువారీ ఆహారంలో బెల్లం ను చేర్చుకుంటున్నారు. అంతే కాకుండా బెల్లంలో ఉండే ఐరన్ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ.. ప్రస్తుతం అంతా కల్తీమయం అయిపోయింది. స్వచ్చంగా లభించే వస్తువులు తగ్గిపోయాయి. తాగే పాల నుంచి తినే బిర్యానీ వరకు అన్నిట్లోనూ కల్తీనే. ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఒళ్లు గుల్లయిపోవడం ఖాయం. కాబట్టి మీరు ఉపయోగించే బెల్లం కల్తీ అయిందో.. లేదో.. ఈ సింపుల్ చిట్కాల ద్వారా ఈజీగా కనిపెట్టేయవచ్చు.

బెల్లం రంగును నిశితంగా పరీక్షించాలి. ఇలా చేయడం ద్వారా నిజమైన, నకిలీ బెల్లాన్ని గుర్తించవచ్చు. చిక్కటి రంగు బెల్లం స్వచ్ఛతకు ప్రతీక అని గుర్తించాలి. స్వచ్ఛమైన బెల్లం రంగు ముదురు గోధుమ రంగులో ఉంటుంది. బెల్లం కల్తీ అయినప్పుడు, దాని రంగు లేత పసుపు లేదా లేత గోధుమ రంగులోకి మారుతుంది. బెల్లం తెలుసుకోవడానికి ముందు బెల్లం రుచి చూడాలి. స్వచ్ఛమైన బెల్లం రుచి చాలా మధురంగా​ఉంటుంది. కల్తీ బెల్లం రుచి చేదుగా లేక ఉప్పగా ఉంటుంది. దీంతో వెంటనే నకిలీ బెల్లం గుర్తించవచ్చు.

నీటిని ఉపయోగించి నిమిషాల్లో బెల్లం స్వచ్ఛతను తనిఖీ చేయవచ్చు. దీని కోసం, ఒక గ్లాసులో నీరు తీసుకోవాలి. ఒక చిన్న బెల్లం ముక్కను నీటిలో వేయాలి. కొంత సమయం తర్వాత అసలైన బెల్లం నీటిలో కరిగిపోతుంది. కల్తీ జరిగితే కరిగిపోకుండా గ్లాసు అడుగు భాగాన పేరుకుంటుంది.

ఇవి కూడా చదవండి

బెల్లంలో ఇనుము, కాల్షియం, భాస్వరం, పొటాషియం, విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాబట్టి బెల్లం తీసుకోవడం వల్ల శరీరంలోని పోషకాల లోపాన్ని భర్తీ చేయవచ్చు. బెల్లం తినడం వల్ల శరీరంలోని రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే, బెల్లం వినియోగం బరువు తగ్గడానికి ఉత్తమమైనది.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..