కొలెస్ట్రాల్ డేంజర్ బెల్స్.. ఈ ఫుడ్స్ తింటే గుండె పోటు పక్కా..!

కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడానికి కేవలం జీవనశైలి మాత్రమే కాదు.. మనం రోజూ తీసుకునే ఆహారం కూడా ప్రధాన కారణం. ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, రెడీమేడ్ ఫుడ్, బేకరీ ఫుడ్స్‌లో ఉండే చెడు కొవ్వులు గుండెకు తీవ్రమైన ముప్పును కలిగిస్తాయి. ఇలాంటి చెడు ఆహారపు అలవాట్లను మార్చుకోవడమే.. ఆరోగ్యంగా ఉండేందుకు మొదటి అడుగు.

కొలెస్ట్రాల్ డేంజర్ బెల్స్.. ఈ ఫుడ్స్ తింటే గుండె పోటు పక్కా..!
Cholesterol

Updated on: Jul 29, 2025 | 6:39 PM

మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. వ్యాయామం చేయకపోవడం, పొగ తాగడం, మద్యం ఎక్కువగా తాగడం, సరైన ఆహారం తీసుకోకపోవడం.. ఇవన్నీ కలిసి చెడు కొలెస్ట్రాల్‌ ను పెంచుతాయి. ముఖ్యంగా మనం రోజూ తినే కొన్ని ఆహారాలు దీనికి ముఖ్య కారణం అవుతాయి. అలాంటి ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రాసెస్డ్ ఫుడ్స్

ఇవి ఎక్కువ ప్రాసెస్ చేసి ప్యాక్ చేస్తారు. వీటిలో సాల్ట్, ప్రిజర్వేటివ్స్, బ్యాడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ బాడీలో చెడు కొలెస్ట్రాల్ (LDL) లెవెల్స్ పెంచుతాయి. ఉదాహరణకు బేకన్, హాట్‌డాగ్స్, సాసేజ్‌లు లాంటి నాన్ వెజ్ ఐటమ్స్ దీని కిందకు వస్తాయి. వీటిని తరచుగా తినడం మానేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది.

రెడ్ మీట్‌

పంది, గొర్రె, గొడ్డు మాంసం లాంటి రెడ్ మీట్‌ లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ ను పెంచి గుండె జబ్బులకు కారణం కావచ్చు. అందుకే వీటిని తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి.

ఫ్రైడ్ ఐటమ్స్

నూనెలో బాగా డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్‌లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఫ్రెంచ్ ఫ్రైస్, సమోసాలు, పూరీలు లాంటివి తరచుగా తింటే కొలెస్ట్రాల్ లెవెల్స్ డేంజర్ లెవెల్‌కి చేరవచ్చు. వీటిని తగ్గించుకుంటేనే మంచిది.

అధిక చక్కెర

మీరు కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయాలంటే.. చక్కెర ఎక్కువ ఉండే స్వీట్లు, కూల్ డ్రింక్స్, ప్యాక్ చేసిన స్వీట్స్ లాంటివి తగ్గించాలి. ఇవి బరువు పెంచడమే కాదు.. మీ శరీరంలో కొవ్వు నిల్వలపై ప్రభావం చూపి కొలెస్ట్రాల్‌ను కూడా పెంచుతాయి.

రెడీమేడ్ స్నాక్స్

చాలా మంది తక్కువ టైంలో తినడానికి రెడీగా దొరికే ప్యాక్డ్ ఫుడ్స్ ఎంచుకుంటారు. కానీ వీటిలో హెల్త్‌ కి హానికరమైన ట్రాన్స్‌ఫ్యాట్‌ లు ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం అవుతాయి. చిప్స్, నూడుల్స్, రెడీ టు ఈట్ ఫుడ్స్ తరచుగా తినడం మంచిది కాదు.

బేకరీ ఐటమ్స్

కేకులు, పేస్ట్రీలు, కుకీలు లాంటి బేకరీ ఐటమ్స్‌ లో ఎక్కువ బట్టర్, షుగర్, రంగులు, ఫ్లేవర్స్ ఉంటాయి. వీటిలో కేలరీలు ఎక్కువ ఉండటమే కాకుండా.. కొలెస్ట్రాల్ పెరగడానికి కూడా కారణమవుతాయి. వీలైనంత వరకు ఈ రకమైన ఫుడ్‌ ను తక్కువగా తినడం మంచిది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)