Shami Benefits: జమ్మి చెట్టు ఆయుర్వేదంలో సర్వరోగ నివారిణి.. ఎడారి ప్రాంతవాసులకు కల్పవృక్షం.. ఎందుకంటే

|

Oct 15, 2021 | 3:07 PM

Shami Medicinal Plant in Ayurveda: హిందువులు జమ్మి చెట్టును విశేషంగా పూజిస్తారు. ముఖ్యంగా దసరా రోజున జమ్మి చెట్టుకి విశిష్ట ప్రాధాన్యత ఉంది. జమ్మి చెట్టు..

Shami Benefits: జమ్మి చెట్టు ఆయుర్వేదంలో సర్వరోగ నివారిణి.. ఎడారి ప్రాంతవాసులకు కల్పవృక్షం.. ఎందుకంటే
Shami Ayuveda Benefits
Follow us on

Shami Medicinal Plant in Ayurveda: హిందువులు జమ్మి చెట్టును విశేషంగా పూజిస్తారు. ముఖ్యంగా దసరా రోజున జమ్మి చెట్టుకి విశిష్ట ప్రాధాన్యత ఉంది. జమ్మి చెట్టు పూజకు మాత్రమే కాదు .. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేద మందులలో శమీవృక్షం ఆకు, పువ్వులు, విత్తనాలు చెట్టు బెరెడు అన్నీ ఉపయోగిస్తారు. ఎన్నో వ్యాధులను నయం చేసే గుణమున్న ఈ చెట్టును సురభి బంగారం అని పిలుస్తారు. ఇక ఎడారి ప్రాంతవాసులకు జమ్మిచెట్టు కల్పవృక్షము అని చెప్పవచ్చును. ఈరోజు జమ్మి చెట్టు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం…

*చర్మసంబంధ వ్యాధులకు మందుగా జమ్మిచెట్టు ఆకులు, బెరడు వినియోగిస్తారు.
*కుష్టు రోగ నివారణకు, అవాంఛిత రోమాల నివారణకు జమ్మి యొక్క ఆకులను ఉపయోగిస్తారు.జమ్మి ఆకుల నుంచి పసరు తీసి పుళ్ళు ఉన్న చోట రాస్తే కుష్ఠువ్యాధి నశిస్తుంది.
*జమ్మిపూలను చెక్కరతో కలిపి సేవించడం వలన గర్భస్రావం జరగకుండా నిరోధించవచ్చు.
*జమ్మి చెట్టు బెరడు దగ్గు, ఆస్తమా మొదలైన వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది.
*కొన్ని జమ్మి ఆకులు, కొంచం చెట్టు బెరడు, రెండు మిరియాలు నూరి మాత్రలు చేసుకొని మజ్జిగతో వేసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది. ఇలా ఎన్నో రోగాలకు ఉపయోగపడుతుంది.
*జమ్మిచెట్టు చెట్టు బెరడుతో పొడి చేసుకొని, నీళ్లలో మరిగించి పుక్కిలిస్తే గొంతునొప్పి, పంటి నొప్పి తగ్గుతాయి.
*జమ్మిచెట్టు కాయలు పోషకాహారం. “సాంగ్రియా ” గా పిలిచే వీటితో కూరలు వండుతారు. జమ్మిచెట్టు గింజలను ఎండ బెట్టి సంవత్సరం మొత్తం కూరలలో వాడతారు .
*జమ్మిచెట్టు సర్వరోగనివారిణి అని ఆయుర్వేదంలో పేర్కొన్నారు.

ఎడారి ప్రాంతవాసులకు జమ్మిచెట్టు కల్పవృక్షము అని చెప్పవచ్చును , ఎందుకంటే వీటి పొడవైన వేళ్లు నీటిని గ్రహించినందు వల్ల భూమి సారవంతముగా ఉంటుంది . వేసవి ఎండలలో ఎడారి ప్రాంత వాసులకు నీడను ఇస్తుంది. జమ్మిచెట్టుకి ఉన్న ప్రాముఖ్యతను గుర్తిస్తూ ‘యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్’ భూసారాన్ని పెంచేందుకు ప్రతి ఇంట్లోనూ ఒక జమ్మిచెట్టుని నాటమని సూచిస్తోంది. కానీ మనదగ్గర మాత్రం ఉన్న కొన్ని జమ్మి చెట్లూ నాశనం అయిపోతున్నాయి. ఇప్పటి పిల్లలైతే జమ్మి చెట్టుని గుర్తిస్తారో లేదో కూడా అనుమానమే! అయితో ఇప్పటికీ పల్లెల్లో కొందరు ఇంటి ప్రహరీ గోడలపై, వాకిళ్లపై జమ్మి కాండాలను ఉంచుతారు. ఇలా చేయడం వలన చెడు దరిచేరదని ప్రజల నమ్మకం. రైతులు తమ పశుపక్ష్యాదుల ఆరోగ్యం కోసం జమ్మిని పూజిస్తుంటారు.

Also Read:  ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కారు బోల్తా… కారులో ఎమ్మెల్యే లేకపోవడంతో తప్పిన ప్రమాదం..