Health Benefits Of Sapota: రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు మనం తరచుగా పండ్లు తింటుంటాం. అయితే వాటి నుంచి మనకు ఏ పోషకాలు లభిస్తున్నాయో అంతగా పట్టించుకోము. కానీ ఏ పండు నుంచి ఏలాంటి పోషకాలు, విటమిన్లు లభిస్తాయో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మంచి ఆరోగ్యం కావాలంటే పండ్లు తినాలని సూచిస్తున్నారు నిపుణలు. అలా మేలు చేసే పండ్లల్లో సపోటా కూడా ఒకటి. సపోటాలో ఎలాంటి పోషకాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
సపోటా ప్రయోజనాలు..
సపోటాలో పోషకాలతో పాటు యాంటీ యాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. సపోటా తినడం వల్ల గర్భిణీలు, పాలు ఇచ్చే తల్లులకు పోషకాలు త్వరగా అందుతాయి. దీంతపాటు వీరిలో శక్తిని కూడా పెంచుతుంది.
స్థూలకాయం లేదా ఊబకాయ సమస్యలతో బాధపడేవారు సపోటా తినడం మంచిది. శరీరంలో కొవ్వును సైతం కరిగిస్తుంది.
తరచుగా సపోటా తినడం, లేక సపోటా జ్యూస్ తాగడంగానీ చేస్తే జుట్టు సమస్యలు తగ్గుతాయి. జుట్టు రాలడం, చుండ్రు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
సపోటా తింటే విటమిన్-A పుష్కలంగా లభిస్తుంది. విటమిన్- ఏ కంటిచూపును మెరుగుపరుస్తుంది. కంటిచూపు కూడా తగ్గకుండా చేస్తుంది.
సపోటా తింటే.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సపోటాలో ఉండే విటమిన్లు, పోషక పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వృద్ధాప్యంలో వచ్చే అంధత్వ నివారణకు కొంతమేర పరిష్కారం చూపుతుంది.
Also Read: