Eye Care Tips: కళ్ళకు విశ్రాంతి లేదా.. ఎర్రగా మారి దురదలు పెడుతున్నాయా.. ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి

|

Oct 14, 2021 | 5:20 PM

World Sight Day: రోజు రోజుకీ పెరుగుతున్న కాలుష్యం  కళ్ళ పై ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు. అంతేకాదు కంప్యూటర్ , సెల్ ఫోన్ల వాడడం..

Eye Care Tips: కళ్ళకు విశ్రాంతి లేదా.. ఎర్రగా మారి దురదలు పెడుతున్నాయా.. ఈ చిట్కాలతో ఉపశమనం పొందండి
Eye Care Tips
Follow us on

World Sight Day: రోజు రోజుకీ పెరుగుతున్న కాలుష్యం  కళ్ళ పై ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు. అంతేకాదు కంప్యూటర్ , సెల్ ఫోన్ల వాడడం కూడా పెరిగిన తర్వాత కంటికి విశ్రాంతి తగినంతగా లభించడం లేదని.. దీంతో కళ్ళు కలసి పోతున్నాయని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక అలసిన కళ్ళు ఎరుపుగా మారతాయి.. కొన్ని సార్లు కంటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటాము కూడా.. సున్నితమైన అవయవం కళ్ళు.. ఇవి.. డ్రై ఐ సిండ్రోమ్, అలర్జీ,  కంటికి విశ్రాంతి లేకపోవడం, ధూమపానం చేయడం, జలుబు, ఫ్లూ వంటి అనేక కారణాలతో ఎర్రగా మారుతుంటాయి.
ఇలా అలసిన కళ్ళకు విశ్రాంతి ఇస్తూ.. ఎర్రదనాన్ని తగ్గించుకునేందుకు ఈ సహజమైన సింపుల్ చిట్కాలను పాటించి చూడండి..

*కళ్ళు బాగా అలసి విశ్రాంతి కోరుతున్నట్లు అనిపిస్తే.. వెంటనే  ఒక బంగాళా దుంపను తీసుకుని దానిని.. సన్నటి చిప్స్ లా కట్ చేసి.. రెండు కళ్ళమీద పెట్టు.. ఒక అరగంట పాటు తగిన విశ్రాంతి తీసుకుంటే.. చక్కని ఉపశమనం లభిస్తుంది.

* కళ్ళు ఎర్రగా ఉంటే రోజ్ వాటర్ తో మంచి ఉపశమనం లభిస్తుంది. మంచి కంపీనీ రోజ్ వాటర్ ను ఎంచుకుని శుభ్రమైన డ్రాపర్ సహాయంతో రెండు కళ్ళల్లో రెండు నుంచి నాలుగు చుక్కలు వేసుకోవాలి. దీంతో కాంతిలో చేరిన మలినాలు బయటకు వచ్చి కళ్ళు శుభ్రపడతాయి. కళ్ళు మంటలు తగ్గి చల్లగా కూడా ఉంటాయి.

* కళ్ళు అలసిపోయి చికాకుగా ఉన్న ఫీలింగ్ ఉంటె ఉపశమనం పొందడానికి కమోమిల్‌ ఐ వాష్ మంచి సహకార అని ఆయుర్వేదం ద్వారా తెలుస్తోంది. ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు నీటి బాగామరిగించాలి.. అనంతరం ఆ నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఎండిన కమోమిల్‌ ఆకులను వేసి 3-4 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత ఆ నీటిని చల్లబరిచి వాటితో కళ్లను శుభ్రం చేసుకోవాలి. ఇలా ఐ వాష్ చేయడం వలన కళ్ళలో పడిన దుమ్ము, ధూళి కణాలు తొలగి శుభ్రపడతాయి. అంతేకాదు కళ్ళకు చల్లదనం ఇస్తుంది.

* కంటికి ఆముదం మంచి రిలేషన్ ఉంది. కంటికి సంబంధించిన అసౌకర్యాన్ని ఆముదం తీరుస్తుంది.  కళ్ళు దురదగా, అసౌకర్యంగా అనిపిస్తే.. ఆముదం కంటి రెప్పల మీద అప్లై చేసి.. విశ్రాంతి తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. ఇక ఆముదం నూనె (కల్తీకానిది )కంటిలో వేసుకున్నప్పుడు కొద్దిగా మంట అనిపించినప్పటికీ ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.

* కళ్ళు అలసిపోయి.. ఎర్రగా మారినప్పుడు.. కీర దోసకాయ ముక్కలు మంచి ఉపశమనం ఇస్తాయి. కీరముక్కలను కళ్లపై 20 నిమిషాలపాటు ఉంచుకుంటే కళ్లకు చల్లదనం కలుగుతుంది. కళ్లు తాజాగా మారుతాయి.

అందుబాటులో ఉన్న ఈ  సింపుల్ చిట్కాలను పాటిస్తూ.. కళ్ళకు చల్లదనం ఇవ్వడంతో పాటు.. బయటకు వెళ్లే సమయంలో సూర్య కిరణాల నుంచి వెలువడే అతినీల లోహిత కిరణాల నుంచి రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించడం మంచిది.  ఈ సన్ గ్లాసెస్ మన కళ్ళను దుమ్ము, ధూళి, వాయు కాలుష్యం నుంచి రక్షిస్తాయి. అన్నిటికి మించి కంటి తగిన విశ్రాంతి నిస్తూ.. తగినంత నిద్ర పోవాలి.

Also Read:  హైదరాబాద్ బెంగాలీ సమితిలో ఘనంగా నవమి వేడుకలు.. ఆయుధ పూజలో పాల్గొన్న జూపల్లి రామ్ రావు