Pregnancy Care: గర్భధారణ సమయంలో గుడ్డు తినొచ్చా? ఈ తప్పు అస్సలు చేయొద్దంటున్న నిపుణులు..

|

Dec 22, 2022 | 6:07 AM

గర్భధారణ సమయంలో మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యులు సలహా ఇస్తారు. ఏం తినాలి? ఏం తినకూడదు? వంటి అంశాలను ముందుగానే వివరిస్తారు. తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Pregnancy Care: గర్భధారణ సమయంలో గుడ్డు తినొచ్చా? ఈ తప్పు అస్సలు చేయొద్దంటున్న నిపుణులు..
చాలామంది తమ రోజును గుడ్డు బ్రేక్ ఫాస్ట్ తో ప్రారంభిస్తారు. ప్రోటీన్, విటమిన్లు సమృద్ధిగా ఉండే గుడ్లు శరీరానికి ఎంతగానో ఉపయోగకరమైనవి. శరీరానికి కావలసిన శక్తినిచ్చే గుడ్లలో ఉపయోగకరమైన గుణాలు చాలా ఉన్నప్పటికీ ఎక్కువగా తినడం ఆరోగ్యానికి ప్రమాదమని నిపుణులు అంటున్నారు.
Follow us on

గర్భధారణ సమయంలో మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యులు సలహా ఇస్తారు. ఏం తినాలి? ఏం తినకూడదు? వంటి అంశాలను ముందుగానే వివరిస్తారు. తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అయితే, గర్భిణీ స్త్రీలలో ఎక్కువగా వచ్చే సందేహం ఒకటుంది. గర్భధారణ సమయంలో గుడ్లు తీసుకోవడం సురక్షితమా? కదా? అనేది చాలా మంది ప్రశ్న. మరి దీనికి సమాధానం ఏంటి? నిపుణులు ఏం చెబుతున్నారు ఇప్పుడు తెలుసుకుందాం..

గర్భధారణ సమయంలో గుడ్లు తినొచ్చా?

గర్భధారణ సమయంలో వైద్యులు అనేక రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తుంటారు. ఈ లిస్ట్‌లో పచ్చి, ఉడకని ఆహారం తీసుకోవద్దు. ఇలాంటి వాటిల్లో బ్యాక్టీరియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటమే దీని వెనుక కారణం. ఈ బ్యాక్టీరియా గర్భిణీ స్త్రీలకు, పుట్టబోయే బిడ్డకు ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే.. గుడ్డును కూడా ఉడికించి తీసుకోవచ్చు.

గుడ్లు ఎలా తీసుకోవాలి?

గుడ్లు సాల్మొనెల్లా వ్యాధికి కారణమవుతాయి. గర్భధారణ సమయంలో గుడ్లు నుండి తయారైన మయోన్నైస్ కు దూరంగా ఉండాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గర్భిణీ స్త్రీలు పచ్చి లేదా హాఫ్ బాయిల్డ్ గుడ్లతో తయారు చేసిన వంటకాలకు దూరంగా ఉండాలి.

గుడ్లు ఉడకబెట్టేటప్పుడు జాగ్రత్తగా..

గర్భిణీ స్త్రీలు గుడ్డు పసుపు భాగం గురించి కూడా శ్రద్ధ వహించాలి. గుడ్డును సుమారు 10 నుండి 12 నిమిషాల పాటు బాగా ఉడకబెట్టాలి. వేయించిన కోడిగుడ్లను తినేటప్పుడు.. దానిని 2 నుండి 3 నిమిషాలు రెండు వైపులా ఉడికించాలి.

గర్భధారణ సమయంలో గుడ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..

ప్రెగ్నెన్సీ సమయంలో గుడ్లు తినడం వల్ల మహిళలకు చాలా రకాలుగా మేలు జరుగుతుంది. గుడ్డులో తగినంత కొవ్వు, ప్రోటీన్లు ఉంటాయి. దీని కారణంగా.. శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. ఇది గర్భధారణ మధుమేహ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

బిడ్డ ఆరోగ్యానికి మేలు..

గుడ్డులోని పోషకాలు కడుపులో పెరుగుతున్న పిల్లల ఎదుగుదలకు ఎంతో మేలు చేస్తాయి. ఇందులో లభించే విటమిన్ బి12, కోలిన్ ఆరోగ్యకరమైన మెదడు అభివృద్ధికి ఎంతో మేలు చేస్తాయి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..