Diwali 2022: పండగ వేళ పిండివంటలు, ఫ్రైడ్‌ ఫుడ్స్‌.. ఈ టిప్స్‌తో కడుపు ఉబ్బరం సమస్యలను దూరం చేసుకోండి

|

Oct 23, 2022 | 10:24 AM

ఇక ఏ పండగైనా రుచికరమైన వంటకాలు, విందులు, వినోదాలు ఉండాల్సిందే. దీపావళి ఇందుకు మినహాయింపేమీ కాదు. ఈపర్వదినాన ప్రజలు వేయించిన పిండి పదార్థాలు, స్నాక్స్‌, స్వీట్లను ఎక్కువగా తింటారు.

Diwali 2022: పండగ వేళ పిండివంటలు, ఫ్రైడ్‌ ఫుడ్స్‌.. ఈ టిప్స్‌తో కడుపు ఉబ్బరం సమస్యలను దూరం చేసుకోండి
Post Diwali Detox Tips
Follow us on

మరికొన్ని గంటల్లో దీపావళి పండగ రానుంది. దేశమంతా ఈ ఫెస్టివల్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటారు. చాలామంది ఈ పండగ కోసం ప్రత్యేక ప్రణాళికలు వేసుకుంటారు. ప్రత్యేక పూజలతో పాటు చిన్నా, పెద్దా టపాసులు పేల్చేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఏ పండగైనా రుచికరమైన వంటకాలు, విందులు, వినోదాలు ఉండాల్సిందే. దీపావళి ఇందుకు మినహాయింపేమీ కాదు. ఈపర్వదినాన ప్రజలు వేయించిన పిండి పదార్థాలు, స్నాక్స్‌, స్వీట్లను ఎక్కువగా తింటారు. అయితే వీటివల్ల కొందరికి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా కడుపు ఉబ్బరం, అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. అలాగే మలబద్ధకం ఇబ్బందిపెట్టవచ్చు. ఈనేపథ్యంలో శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి ఆహారంలో అనేక అంశాలను చేర్చుకోవచ్చు. మరి అవేంటో తెలుసుకుందాం రండి.

నిమ్మరసం

ఇది శరీరం నుండి విషతుల్య పదార్థాలను తొలగించడానికి పనిచేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఎసిడిటీ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగాలి.

పెరుగు

పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. పేగులు ఆరోగ్యంగా ఉండేలా పనిచేస్తాయి. ఇవి శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడతాయి. పెరుగు తీసుకోవడం వల్ల మలబద్ధకం, ఉబ్బరం సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

పండ్లు

పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. ఇందులో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మీరు పండ్లను సలాడ్‌లు, జ్యూస్‌ల రూపంలో తీసుకోవచ్చు. ఇవి శరీరంలోని టాక్సిన్స్‌ని తొలగించడంలో బాగా సహాయపడతాయి.

గ్రీన్ టీ

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా శరీరాన్ని రక్షించడానికి ఇవి పనిచేస్తాయి. గ్రీన్ టీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీ శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం..  క్లిక్ చేయండి