ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో అందరూ ఇబ్బంది పడే సమస్యల్లో హెయిర్ ఫాల్ కూడా ఒకటి. మారిన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది ఈ సమస్యతో బాధ పడుతున్నారు. ఎంత అందంగా ఉన్నా.. జుట్టు అందంగా ఉంటేనే మరింత అందంగా కనిపిస్తారు. చిన్న వారి నుంచి ముసలి తనంలో ఉన్న వారికి కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది. దీంతో మానసికంగా కూడా ఒత్తిడికి గురవుతున్నారు. దానికి తోడు ఇప్పుడున్న పొల్యూషన్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. పోషకాహార లోపం, నీటి కాలుష్యం, గాలి కాలుష్యం, అనారోగ్య సమస్యలు, హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ వంటి కారణాల వల్ల హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది. హెయిర్ ఫాల్ అవడానికి అనేక కారణాలు ఉంటాయి. ఇలా జుట్టు రాలడాన్ని ఎలా అరికట్టాలి అనేది చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. దీని కోసం ఎంతో ఖరీదైన షాంపూలను వాడుతూ ఉంటారు. అయినా ఎలాంటి ఫలితం ఉండదు. ఇప్పటికే హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేయడానికి ఎన్నో చిట్కాలను తెలుసుకున్నాం. ఇప్పుడు మరో టిప్ తెలుసుకోబోతున్నాం. పైనాపిల్ తో కూడా జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేయవచ్చు. మరి పైనాపిల్ ని ఎలా ఉపయోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
టిప్ 1:
ఒక చిన్న బౌల్ లోకి ఒక కప్పు పైనాపిల్ రసం, ఒక టేబుల్ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె తీసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలపై కుదుళ్లకు బాగా పట్టించాలి. 20 నిమిషాల తర్వాత షాంపూతో జుట్టును వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. జుట్టు కుదళ్లు బలంగా తయారై, హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అంతేకాకుండా జుట్టు పొడవుగా పెరిగేందుకు హెల్ప్ అవుతుంది.
టిప్ 2:
ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు పైనాపిల్ రసానికి, ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె లేదా పటిక నూనె, ఆ తర్వాత ద్రాక్ష పండు నూనె నాలుగు లేదా ఐదు చుక్కలు వేయాలి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకుని ఓ 30 నిమిషాలు తలకు బాగా పట్టించాలి. ఆ తర్వాత తల స్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు రాలడం అనేది బాగా తగ్గుతుంది.
టిప్ 3:
ఒక చిన్న బౌల్ లోకి ఒక కప్పు పైనాపిల్ రసం, పెరుగు రెండు టేబుల్ స్పూన్లు, కొబ్బరి నూనె రెండు టేబుల్ స్పూన్లు వేసి బాగా కలుపు కోవాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకూ బాగా తలకు పట్టించాలి. ఆ తర్వాత షాంపూతో తల స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కుదుళ్లు బలంగా మారతాయి. అంతే కాకుండా జుట్టు కూడా రాలడం తగ్గి, నల్లగా మారతాయి.
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.