Sugarcane Juice: ఈ సమస్యలు ఉన్నవారు చెరకు రసం అస్సలు తాగకూడదు.. ఎందుకంటే..

|

Mar 12, 2022 | 2:42 PM

వేసవి కాలం వచ్చేసింది.. అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు వేసవి తాపం నుంచి తప్పించుకునేందుకు చల్లని పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు...

Sugarcane Juice: ఈ సమస్యలు ఉన్నవారు చెరకు రసం అస్సలు తాగకూడదు.. ఎందుకంటే..
Sugar Cane
Follow us on

వేసవి కాలం వచ్చేసింది.. అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. దీంతో ప్రజలు వేసవి తాపం నుంచి తప్పించుకునేందుకు చల్లని పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి వాటిలో చెరుకు రసం(Sugarcane Juice) కూడా ఒకటి. ఈ చెరుకు రసం అనేది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఇకపోతే చెరుకులో కూడా రకాలు ఉంటాయి. తెలుపు, ఎరుపు, నలుపు రంగులలో మనకు లభిస్తాయి. చెరుకును ఎక్కువగా బెల్లం, చక్కెర(Sugar) తయారీల కోసం ఉపయోగిస్తారు. కానీ చెరుకు రసం తాగడం వల్ల శరీరానికి చలవ చేయడంతోపాటు పొట్టలో పేరుకుపోయిన కొవ్వును కూడా తగ్గిస్తుంది. రక్తాన్ని శుభ్రం చేయడమే కాదు పురుషులలో వీర్య(Sparms) పుష్టిని పెంచడానికి కూడా చెరుకు రసం చాలా బాగా పనిచేస్తుంది.

ఇక పోతే కొంతమంది చెరుకును కాల్చి ఆ తర్వాత దాని నుండి రసాన్ని తీసి తాగుతూ ఉంటారు. ఇలా చేయడం అస్సలు మంచిది కాదు.. ఎందుకంటే ఇలా కాల్చిన తర్వాత ఆ రసాన్ని తాగడం వల్ల వాతం, కంటి సమస్యలు ఎక్కువవుతాయి. చెరుకు రసాన్ని తీసేటప్పుడు కొనలు, మొదళ్లను, ఈనెలను తీసి వేసి మిగతా భాగం తోనే చెరకు రసాన్ని తీయాలి.. ఇక భోజనం చేసిన తర్వాత ఈ చెరుకు రసాన్ని తాగితే తిన్న ఆహారం త్వరగా జీర్ణమవదు. యంత్రాల ద్వారా తీసిన చెరుకు రసాన్ని అసలు తాగకూడదు.. ఎందుకంటే ఇందులో ఎన్నో మలినాలు ఉంటాయి.

చెరుకు రసం అజీర్ణం, శ్వాస సంబంధిత వ్యాధులు, డయాబెటిస్, జ్వరం , శరీరం వాపు వంటి సమస్యలు ఉన్న వారు అసలు తాగకూడదు. చెరుకు రసాన్ని అధికంగా తాగి ఇబ్బందిపడుతున్నట్లయితే విరుగుడుగా సోపు గింజల రసం లేదా అల్లం రసం తాగవచ్చు. కాబట్టి చెరుకు రసాన్ని ఇంట్లో తయారు చేసుకొని తాగితే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. లేకపోతే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు పళ్ళు పుచ్చిపోయి నలుపెక్కి ఉన్నట్లయితే అలాంటి పిల్లలచేత ఈ చెరుకును తినిపించడం వల్ల తర్వాత వచ్చే పళ్ళు చాలా తెల్లగా వస్తాయి.

గమనిక: ఇందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించాలి.

Read Also.. High Blood Pressure: అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ 5 పదార్థాలతో చెక్ పెట్టండిలా..