మనిషికి ప్రతిరోజూ తగినంత నిద్ర ఎంత ముఖ్యమోనన్న విషయం అందరికీ తెలిసే ఉంటుంది. రోజులో 7 నుంచి 8 గంటలపాటు నిద్రపోకపోతే.. ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. సమయానికి తగినట్లు నిద్రపోకపోవడం వల్ల రోజంతా సరిగ్గా సాగదు. అయితే, అవసరానికి మించి నిద్రపోవడానికి ఇష్టపడే వారు కూడా ఉంటారు. అలాంటి వారు వీకెండ్ (శనివారం – ఆదివారం) ఎప్పుడు వస్తుందా..? గంటల తరబడి ప్రశాంతంగా ఎప్పుడు నిద్రపోతామా? అని ఆలోచిస్తుంటారు. అలాంటి వారిలో మీరు కూడా ఉన్నట్లయితే.. అప్రమత్తంగా ఉండాలంటున్నారు.. ఆరోగ్య నిపుణులు.. ఎందుకంటే ఎక్కువ నిద్ర మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
భారతదేశంలో లక్షలాది మంది మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు. అటువంటి పరిస్థితిలో ఎక్కువసేపు నిద్రపోవడం కూడా మిమ్మల్ని ఈ వ్యాధి బారిన బంధించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల చక్కెర స్థాయి పెరిగే ప్రమాదం ఉంది. టోక్యో విశ్వవిద్యాలయం పరిశోధన ప్రకారం.. 9 గంటలకు మించి నిద్రించే వారి శరీరంలో షుగర్ రిస్క్ పెరుగుతుందని పేర్కొంది. 12 మందికి పైగా ఈ అధ్యయనం చేయగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీ పరిశోధన ప్రకారం.. ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల ఎడమ జఠరిక బరువు పెరుగుతుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అంతేకాకుండా ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల స్ట్రోక్ రిస్క్ 46 శాతం పెరుగుతుందని మరొక పరిశోధనలో తేలింది. ఈ అధ్యయనంలో 9 నుంచి 11 గంటలు నిద్రపోయే స్త్రీలలో గుండె జబ్బుల ప్రమాదాన్ని 38 శాతం పెంచుతుందని తేలింది.
కుర్చీపై కూర్చొని పనిచేసే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఈ వ్యక్తులు ఎక్కువగా నిద్రపోతారు. అలాంటి వారు ఈ పొరపాటు చేస్తుంటే అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇది వెన్నునొప్పికి కారణం కావచ్చు. మెడ, భుజాలలో నొప్పి వస్తుంది. దీని కారణంగా పలు వ్యాధుల వ్యాప్తి కూడా పెరుగుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..