‘Miracle’ Drug: ‘లాటరీ’లో ప్రాణాలు దక్కించుకున్న చిన్నారి.. ఆనందంలో తల్లిదండ్రులు

|

Jun 27, 2021 | 5:25 PM

కోయంబత్తూరుకు చెందిన జైనబ్ అనే ఏడాది వయసున్న చిన్నారికి ఓనసెమ్నాజీన్ (Zolgensma) మెడిసిన్ శనివారం లాటరీలో దక్కింది. ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో జైనబ్‌కు ఇంజెక్షన్ వేశారు.

Miracle Drug: ‘లాటరీ’లో ప్రాణాలు దక్కించుకున్న చిన్నారి.. ఆనందంలో తల్లిదండ్రులు
Miracle Drug Worth Rs 16 Cr
Follow us on

ఓ చిన్నారి లక్కీ లాటరీలో తన ప్రాణాలను దక్కించుకుంది. అదేంటి లాటరీలో డబ్బులు రావాలి కాదా అనుకుంటున్నారా! అవును ఆ చిన్నారి..లాటరీలో తన ప్రాణాలను కాపాడే ఓ మెడిసిన్ దక్కించుకుంది. అయితే లాటరీలో దక్కించుకున్నది మాత్రం ఆ చిన్నారి ప్రాణాలను కాపాడే ‘లాటరీ’లో రూ.16 కోట్ల విలువ చేసే మెడిసిన్. దీంతో ఆ చిన్నారి ప్రాణం నిలిచింది. స్పైనల్ మస్క్యులర్ అట్రాఫీ (SMA).. చిన్నపిల్లల్లో కనిపించే ఓ జన్యు వాధి. పెరిగే కొద్దీ వారి వెన్ను వంగి ప్రాణాలను మింగేస్తుంది. ఆ పిల్లల ప్రాణాలను కాపాడేందుకు ఒకే ఒక్క మందుంది. అదీ చిన్నప్పుడే వేయాలి. కానీ, దాని ధరే సామాన్యుడికి అందనంత స్థాయిలో ఉంటుంది. దాని ఖరీదు రూ.16 కోట్లు ఉంటుంది. ఈ ఔషధం కోసం ఎంతో మంది అభాగ్యులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ఎదురుచూస్తూంటారు. కేంద్ర ప్రభుత్వం ఈ మందును ఇప్పించి ప్రాణాలు కాపాడటం కానీ లేదంటే దాతలు ఎవరైనా సాయం చేసి ఆ మెడిసిన్ వారి అందించాలి.

జైనబ్‌కు ఎస్ఎంఏ…

కోయంబత్తూరుకు చెందిన జైనబ్ అనే ఏడాది వయసున్న చిన్నారికి ఓనసెమ్నాజీన్ (Zolgensma) మెడిసిన్ శనివారం లాటరీలో దక్కింది. జైనబ్‌కు ఎస్ఎంఏ ఉన్నట్టు ఆమె తల్లిదండ్రులు అబ్దుల్లా, ఆయిషాకు ఇటీవలే తెలిసింది. జబ్బు చేసి ఆసుపత్రికి తీసుకెళ్తే టెస్టులు చేసి ఎస్ఎంఏ అని నిర్ధారించారు. స్పైనల్ మస్క్యులర్ అట్రాఫీ.. చిన్నపిల్లల్లో కనిపించే ఓ జన్యు సంబంధిత వ్యాధి. ఈ వ్యాధి పెరిగే కొద్దీ ఆ పిల్లల వెన్ను వంగి ప్రాణం పోయే అవకాశం ఉంటుంది.

లాటరీ డ్రాలో జైనబ్‌ పేరు…

ఈ నేపథ్యంలో క్యూర్ ఎస్ఎంఏ అనే స్వఛ్చంద సంస్థ రూపొందించిన లాటరీ డ్రాలో జైనబ్‌ పేరు నమోదు చేశారు. అయితే… అంతకుముందే ఎస్ఎంఏ వ్యాధితో అబ్దుల్లా మొదటి సంతానంను కోల్పోయాడు. దీంతో ముందు జాగ్రత్తగా క్యూర్ ఎస్ఎంఏ అనే స్వఛ్చంద సంస్థ రూపొందించిన లాటరీలో పేరును నమోదు చేశాడు. అదృష్టవశాత్తు… నిన్న తీసిన లాటరీ లక్కీ డ్రాలో జైనబ్ తో పాటు మరో ముగ్గురు చిన్నారులకూ మెడిసిన లభించింది. దీంతో ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో జైనబ్ కు ఆ 16 కోట్లు విలువ చేసే ఇంజెక్షన్ వేశారు. ఆస్పత్రి వర్గాలు అత్యంత జాగ్రత్తగా ఈ మెడిసిన్ చిన్నారికి అందిచారు. ఈ ఇంజెక్షన్ మొత్తం పూర్తి కావడానికి 45 నిమిషాల సమయం పట్టింది.  ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగా ఉంది.

Zolgensma Is So Expensive

ఇవి కూడా చదవండి: Maoist party: అడవిలో ఆందోళన.. హరిభూషణ్‌ స్థానంలో ఎవరొస్తారు.. ఇంటెలిజెన్స్ వర్గాల స్పెషల్ ఫోకస్..

Bitcoin: బిట్‌కాయిన్‌కు ఊరట…పెట్టుబడులు పెట్టేందుకు ఓకే చెప్పిన అక్కడి పార్లమెంట్