పని ఒత్తిడి, ఆర్ధిక సమస్యలు.. ఉరుకుల పరుగుల జీవితంతో.. ఈ మధ్యకాలంలో యువత బ్రేక్‌ఫాస్ట్‌ను పక్కనపెట్టేస్తున్నారు. సీదాపోయి మధ్యాహ్నం లంచ్ చేయవచ్చునని భావిస్తున్నారు. అయితే ఇలా టిఫిన్‌ను లైట్ తీసుకునేవారిని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయడంతో పాటు.. రాత్రుళ్లు డిన్నర్ లేటుగా చేయడం మీకూ అలవాటు ఉంటే.. వెంటనే దాన్ని మానుకోవాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని వారి భావన.
ఇడ్లీ, దోశ, వడ, బ్రెడ్ టోస్ట్, ఆమ్లెట్ ఇలా చాలామంది చాలారకాలుగా ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో పనుల హడావుడి, లేట్ నైట్ పడుకోవడం.. ఉదయాన్నే లేట్‌గా లేవడం లాంటి వాటితో అలసత్వంతో చాలాసార్లు బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్ చేస్తున్నారు. అలాగే రాత్రుళ్లు ఆలస్యంగా డిన్నర్ కూడా చేస్తున్నారు. ఇక ఇలా చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పలు దీర్ఘకాలిక రోగాలు దరికి చేరవచ్చునని చెబుతున్నారు. బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్‌ను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకుండా.. టైంకి తీసుకోవాలని.. సరైన సమయానికి సరైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే పాలు, చపాతీ, బ్రెడ్, పండ్లు లాంటి వాటిని ఉదయం టిఫిన్‌గా తీసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు. కాగా, మీరు ఏదైనా డైట్ ఫాలో అయ్యే ముందు కచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించండి.. పై వార్త కేవలం పలు అధ్యయనాలు ఆధారంగా ప్రచురితం చేసింది మాత్రమే