నోటిపూత సమస్య చిన్నదిగా అనిపిస్తుంది.. కానీ ఇది చాలా సమస్యలను కలిగిస్తుంది. నోటిలో అల్సర్ల కారణంగా తీవ్రమైన నొప్పి ఉంటుంది. నోరు విప్పడం కూడా కష్టమయ్యేంత సమస్య చాలా మందికి ఉంటుంది. పొట్టలో అవాంతరాల వల్ల నొటిలో పొక్కుల సమస్య వస్తుంది. మందులతో అల్సర్ల సమస్య కొన్ని రోజులపాటు ఉపశమనం కలుగుతుంది. కానీ తర్వాత అదే పరిస్థితి ఏర్పడుతుంది. చాలా మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. కావున వాటిని అధికంగా తీసుకోవడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని ఇంటి నివారణలు మందుల కంటే చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కొబ్బరి నూనే: కొబ్బరి నూనె కొబ్బరి నూనెలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. నోటిలో అల్సర్లకు కొబ్బరినూనె చాలా మేలు చేస్తుంది. కొబ్బరి నూనెను అల్సర్‌లపై పూయడం వల్ల మంట తగ్గుతుంది. ఇంకా నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
గోండ్ కఠిరా: గొండ్ కఠిరా అల్సర్ల నొప్పిని తొలగిస్తుంది. కఠిరాను పేస్ట్‌గా చేసి, అల్సర్ ఉన్న ప్రదేశంలో పూస్తే అల్సర్‌ల వాపు తగ్గుతుంది. పుండు గాయం కూడా క్రమంగా తగ్గుతుంది.
బీట్‌రూట్: శరీరంలో ఫోలేట్, జింక్ లోపం వల్ల అల్సర్ సమస్య వస్తుంది. బీట్‌రూట్‌లో ఫోలేట్, జింక్ పుష్కలంగా ఉంటాయి. అల్సర్ సమస్య ఉంటే బీట్‌రూట్ జ్యూస్ తయారు చేసి తాగవచ్చు. బీట్‌రూట్‌తో పాటు, మీరు సన్‌ఫ్లవర్ ఆయిల్, ఓట్స్ కూడా తినవచ్చు.
పాల ఉత్పత్తులు: విటమిన్లు లేకపోవడం వల్ల కూడా బొబ్బలు వస్తాయి. నొటిలో బొబ్బలు ఉన్న సమయంలో విటమిన్లు సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తినాలి. అల్సర్‌లో పాల ఉత్పత్తులు తినడం ప్రయోజనకరం. పొక్కులు వచ్చినప్పుడు పెరుగు, నెయ్యి తినడం కూడా మేలు చేస్తుంది. అంతే కాకుండా పప్పు, గింజలు తినడం వల్ల కూడా మేలు జరుగుతుంది.
తేనె: అల్సర్లలో తేనె ప్రయోజనకరంగా పరిగణిస్తారు. తేనెలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది అల్సర్‌లను నయం చేయడంలో సహాయపడుతుంది. నోటిలో అల్సర్ ఉన్న ప్రదేశంలో తేనెను పూయడం వల్ల అల్సర్ల నుంచి ఉపశమనం లభిస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..