ORS Drink: మార్కెట్‌ను ముంచెత్తుతున్న ఓఆర్ఎస్ డ్రింకులు మంచివేనా? నిపుణులు ఏమంటున్నారు?

|

Aug 09, 2021 | 4:38 PM

పిల్లలు డీ హైడ్రేషన్ కు గురైనపుడు మనకు డాక్టర్లు ఓఆర్ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్) ఇవ్వమని చెబుతారు. ప్రస్తుతం మార్కెట్ లో ఈ ఓఆర్ఎస్ డ్రింకులుగా విరివిగా దొరుకుతున్నాయి.

ORS Drink: మార్కెట్‌ను ముంచెత్తుతున్న ఓఆర్ఎస్ డ్రింకులు మంచివేనా? నిపుణులు ఏమంటున్నారు?
Ors Drink
Follow us on

ORS Drink: పిల్లలు డీ హైడ్రేషన్ కు గురైనపుడు మనకు డాక్టర్లు ఓఆర్ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్) ఇవ్వమని చెబుతారు. ప్రస్తుతం మార్కెట్ లో ఈ ఓఆర్ఎస్ డ్రింకులుగా విరివిగా దొరుకుతున్నాయి. మనం వెంటనే ఒక ఓఆర్ఎస్ డ్రింక్ కొని పిల్లలతో తాగించేస్తాం. కానీ, ఇలా చేయడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఓఆర్ఎస్ డ్రింకులు చాలావరకూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రామాణికాలను పాటించడం లేదు. ఇప్పుడు ఓఆర్ఎస్ గా విక్రయిస్తున్న చాలా డ్రింకుల్లో మోతాదుకు మించిన తీపిదనం ఉంటోంది. ఇది పిల్లల ఆరోగ్యంపై చెడుప్రభావాన్ని చూపిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రుచికరమైన వెర్షన్‌లలో అధిక చక్కెర ఉన్న పానీయాలు వాస్తవానికి డీ హైడ్రేషన్ పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. చాలాసార్లు పిల్లలు ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి తీసుకువస్తుంది.  ఓఆర్ఎస్ ఎప్పుడూ రుచిలో తీపిగా ఉండకూడదు.ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణం లేని తియ్యని ఓఆర్ఎస్ డ్రింక్స్ రోగులకు మంచి కంటే ఎక్కువ హాని కలిగిస్తాయని నిపుణుల అభిప్రాయం.

ఓఆర్ఎస్  ఇచ్చినప్పటికీ వారి పరిస్థితి విషమంగా ఉందని తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకువచ్చిన సందర్భాలు దాదాపు ప్రతిరోజూ కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. వారు పిల్లలకు ఏమి ఇచ్చారో  తనిఖీ చేసినప్పుడు, సాధారణంగా రుచిగా ఉండే ORS టెట్రాప్యాక్‌లను వాడినట్టు తెలుస్తోంది.  ఇందులో చక్కెర అధికంగా ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు డబ్ల్యూహెచ్‌ఓ సిఫారసు చేసిన వాటిని ఉల్లంఘిస్తూ చక్కెర, లవణాలను కలిగి ఉన్న అనేక బ్రాండ్‌లను తమకు తెలియకుండానే ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే, మార్కెట్ లో దొరికేవన్నీ ఓఆర్ఎస్ డ్రింకులే అని వారు భావిస్తారు. కానీ, నిజానికి అన్ని ఓఆర్ఎస్ డ్రింకులూ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేవిగా ఉండవని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల ఒకవైపు ఎక్కువ చక్కెర అతిసారానికి తోడ్పడుతుండగా, అవసరమైన దానికంటే తక్కువ ఉప్పు దాని నష్టాన్ని తగినంతగా భర్తీ చేయదు. అంటే మరింత వ్యాధి లక్షణాలు పెరగడానికి కారణం అవుతున్నాయి.

తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడం వలెనే ఇలా జరుగుతోందని వైద్యులు అంటున్నారు. వివిధ ఫ్లేవర్లలో ఆకర్షణీయమైన ప్యాకింగ్ లలో  లభించేవన్నీ ఓఆర్ఎస్ డ్రింకులే అనే భ్రమలో వారు పడిపోతుంటారు.   మరోవైపు పిల్లలు కూడా ఓఆర్ఎస్ డ్రింకు ఇష్టపడతారు. ఇందుకు కూడా కారణం దాని రుచే. ఓఆర్ఎస్ తీయగా.. మంచి ఫ్లేవర్ తో ఉండడంతో పిల్లలు దానిని ఇష్టంగా తాగేస్తారు. కానీ, ఇది ఆరోగ్యాన్ని పాడుచేస్తుందని గమనించలేరని నిపుణులు అంటున్నారు.

పిల్లలకు ఓఆర్ఎస్ ఇచ్చేటపుడు ఈ అంశాలు పాటించాలి..

  • వైద్యుడు సూచించిన ఓఆర్ఎస్ ద్రావణాన్నే..కొనుగోలు చేయాలి.
  • ఓఆర్ఎస్ డ్రింక్ కొనే ముందు అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రమాణాలకు అనుకూలంగా ఉందొ లేదో తనిఖీ చేసుకోవాలి.
  • ఒకవేళ అది ప్రమాణాలకు అనుగుణంగా ఉందొ లేదో నిర్ధారించలేనపుడు వైద్యులకు దానిని చూపించి వారి సలహామేరకు ఆ డ్రింక్ వాడాలి.
  • ఫ్లేవర్ బావుంది అని ఓఆర్ఎస్ కొనవద్దు.

Also Read: Vaccine Mixing: కరోనా వ్యాక్సిన్ ‘మిక్సింగ్’ పరిశోధనల తొలివిడత ఫలితాలు వెల్లడి..ఐసీఎంఆర్ ఏం చెబుతోందంటే..

Fasting Benefits: వారంలో ఒకరోజు ఉపవాసం.. అనేక రోగాలకు చెక్.. మిమ్మల్ని మీరు కాపాడుకునే సూపర్ ఐడియా..