వర్షాకాలంలో జబ్బులకు ఇలా చెక్ పెట్టండి.. ఈ చిట్కాలు పాటిస్తే మీరు సేఫ్..!

వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఆరోగ్య సమస్యలు వెంటాడటం సహజం. నీటి కాలుష్యం, దోమల బెడద, చర్మ వ్యాధులు వంటి వాటి ప్రభావం ఈ సీజన్‌ లో ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మన శరీరాన్ని జబ్బుల నుంచి రక్షించుకోవడానికి కొన్ని చిన్న చిన్న అలవాట్లు పాటించడం తప్పనిసరి.

వర్షాకాలంలో జబ్బులకు ఇలా చెక్ పెట్టండి.. ఈ చిట్కాలు పాటిస్తే మీరు సేఫ్..!
Monsoon Health Care

Updated on: Jul 29, 2025 | 6:48 PM

వర్షాకాలం వచ్చిందంటే చాలు.. రకరకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా నీటి ద్వారా వచ్చే అంటువ్యాధులు, దోమల వల్ల వచ్చే జ్వరాలు, చర్మ సంబంధిత వ్యాధులు ఈ సీజన్‌ లో ఎక్కువ. ఇలాంటి సమయంలో మన శరీరాన్ని రోగాల నుంచి కాపాడుకోవడానికి మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా అవసరం.

సురక్షితమైన నీరు

వర్షాకాలంలో నీటి కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. అందు వల్ల తాగేందుకు ఉపయోగించే నీటిని ముందుగా బాగా మరిగించాలి లేదా ఫిల్టర్ ద్వారా శుద్ధి చేయాలి. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మొదటి మెట్టు.

చేతుల శుభ్రత తప్పనిసరి

బయట నుంచి వచ్చాక లేదా తినే ముందు చేతులను సబ్బుతో కడగడం అలవాటు చేసుకుంటే.. వైరస్‌లు, బ్యాక్టీరియాల వల్ల వచ్చే అంటువ్యాధులను ఆపవచ్చు. ఇది చాలా సింపుల్ కానీ పవర్‌ ఫుల్ టిప్.

ఇంటి భోజనమే బెస్ట్

బయట తయారు చేసిన జంక్ ఫుడ్‌ లోని కలుషిత పదార్థాలు కడుపు సమస్యలకు కారణమవుతాయి. వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ.. బయట తినకుండా ఇంట్లో వేడి వేడిగా శుభ్రంగా తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవాలి.

పండ్లు, కూరగాయల శుభ్రం

కూరగాయలు, పండ్లు కొన్న వెంటనే వాటిని నానబెట్టి బాగా కడిగిన తర్వాత వాడడం ద్వారా వాటి మీద ఉండే క్రిములను తొలగించవచ్చు. ఇది చాలా అవసరం.. ముఖ్యంగా వర్షాకాలంలో అదనపు జాగ్రత్త తీసుకోవాలి.

వ్యక్తిగత శుభ్రత ముఖ్యం

ముఖం, చేతులు, కాళ్లు శుభ్రంగా ఉంచుకోవడం, ఉతికిన బట్టలు వేసుకోవడం ద్వారా చర్మ సంబంధిత అంటువ్యాధులను నివారించవచ్చు. ముఖ్యంగా వర్షంలో తడిచిన తర్వాత వెంటనే బట్టలు మార్చుకోవడం చాలా ముఖ్యం.

వ్యాయామం మస్ట్

శరీరాన్ని చురుకుగా ఉంచడానికి చిన్నపాటి వ్యాయామం చేసినా సరిపోతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడుతుంది. ఇంట్లో ఉండే సులభమైన యోగా ఆసనాలు, స్ట్రెచింగ్‌లు చేయవచ్చు.

వేడి ఆహారమే బెస్ట్

వర్షాకాలంలో చల్లగా ఉన్న, రాత్రి నిల్వ ఉంచిన ఆహారానికి బదులుగా.. తాజాగా చేసిన వేడి పదార్థాలే తీసుకోవాలి. దీని వల్ల జీర్ణక్రియ సరిగ్గా జరుగుతుంది, వ్యాధులకు దూరంగా ఉండొచ్చు.

ఈ వర్షాకాలాన్ని ఆరోగ్యంగా గడిపేందుకు పై సూచనలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. చిన్నపాటి జాగ్రత్తలే పెద్ద ప్రమాదాల నుంచి కాపాడగలవు.