Mental Health: దేశ వ్యాప్తంగా పెరుగుతోన్న మానసిక రోగుల సంఖ్య.. కారణం ఇదేనట!

దేశ వ్యాప్తంగా గత కొన్నేళ్లుగా మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత మానసిక ఆరోగ్యం సమస్య మరింత పెరుగుతోంది. ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యల బారిన అధిక మంది పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. కోవిడ్ తర్వాత ఆందోళన, డిప్రెషన్‌ కేసులు 25 శాతం పెరిగాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. వైద్యుల అభిప్రాయం ప్రకారం..

Mental Health: దేశ వ్యాప్తంగా పెరుగుతోన్న మానసిక రోగుల సంఖ్య.. కారణం ఇదేనట!
Mental Health

Updated on: Apr 12, 2024 | 5:40 PM

దేశ వ్యాప్తంగా గత కొన్నేళ్లుగా మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత మానసిక ఆరోగ్యం సమస్య మరింత పెరుగుతోంది. ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యల బారిన అధిక మంది పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. కోవిడ్ తర్వాత ఆందోళన, డిప్రెషన్‌ కేసులు 25 శాతం పెరిగాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే మానసిక ఆరోగ్యం క్షీణించే సమస్య పెరుగుతున్నప్పటికీ చాలా సందర్భాలలో అనేక మంది దీనిని గుర్తించలేక పోతున్నారు. దీంతో ఈ సమస్య చాపకింద నీరులా పెరిగిపోవడంతో ప్రజల మానసిక ఆరోగ్యం గణనీయంగా క్షీణిస్తుంది. ఇది మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది.

మానసిక ఆరోగ్యానికి సంబంధించిన కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? మానసిక ఆరోగ్యాన్ని ఎలా మెరుగు పరచుకోవచ్చు? దీని గురించి తెలుసుకునేందుకు ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ అలైడ్ సైన్సెస్ (ఇహ్‌బాస్ హాస్పిటల్)లో సైకియాట్రీ ప్రొఫెసర్ డాక్టర్ ఓంప్రకాష్‌తో మాట్లాడుతూ..

మానసిక ఆరోగ్యం ఎందుకు క్షీణిస్తోంది?

కరోనా మహమ్మారి తర్వాత మానసిక సమస్యలతో బాధపడుతున్న రోగులు మరింత పెరిగినట్లు డాక్టర్ ఓంప్రకాష్ చెప్పారు. తీవ్రమైన మానసిక వ్యాధులతో బాధపడుతున్న రోగుల సంఖ్య పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం, వైవాహిక సంబంధాలలో విభేదాలు, జీవితంలోని కొన్ని విషాద సంఘటనలు ప్రధాన కారకాలుగా చెప్పవచ్చు. చెడు జీవనశైలి కూడా మానసిక ఆరోగ్యం క్షీణించడానికి మరో కారణం.ఇటీవలి కాలంలో భారతదేశంలో మానసిక వ్యాధులు, ఆత్మహత్య ధోరణులు పెరుగుతున్నాయని, ముఖ్యంగా పని ఒత్తిడి, అలసట గురించి ఎక్కువ మంది ఫిర్యాదు చేస్తున్నట్లు డాక్టర్ ఓంప్రకాష్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఒంటరితనం కూడా కారణమా?

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒంటరితనాన్ని ప్రపంచ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా పరిగణిస్తోందని డాక్టర్ ఓం ప్రకాష్ వివరించారు. కరోనా మహమ్మారి తర్వాత ఒంటరి తనం కారణంగా మానసిక ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఈ సమస్య అన్ని వయసులవారిలో ముఖ్యంగా యువతలో అధికంగా కనిపిస్తుంది. WHO దీనిని ప్రపంచ ప్రాధాన్యతగా గుర్తించింది. సామాజిక కనెక్షన్‌లను ప్రోత్సహించడానికి కృషి చేస్తోంది.

టెలి హెల్ప్‌లైన్ సహాయం తీసుకోవాలి..

టెలిమనస్ హెల్ప్‌లైన్ 14416, 1-800-891-4416 సహాయం తీసుకోవాలని డాక్టర్ ఓంప్రకాష్ చెప్పారు. ఈ నెంబర్లకు కాల్ చేయడం ద్వారా మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తులు ఫోన్‌లో సహాయం పొందవచ్చు. TeleManas నంబర్ 14416, 1800-89-14416 టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ ను కూడా సంప్రదించవచ్చు. ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలతో బాధనడు వారు మానసిక నిపుణులను సంప్రదించవచ్చు.

ఎలా బయటపడాలి..?

  • ఎల్లప్పుడూ సానుకూలంగా ఆలోచించాలి
  • మీరు చేసే పనిపై దృష్టి పెట్టాలి
  • అనవసరంగా చింతించకూడదు
  • ప్రతిరోజూ నిద్ర, మేల్కొనే సమయాన్ని సెట్ చేసుకోవాలి
  • యోగా సహాయం తీసుకోవచ్చు

ఇవన్నీ చేసిన తర్వాత కూడా మీ మానసిక ఆరోగ్యం మెరుగుపడకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి.