బెల్లం గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. భారత దేశంలోనే కాకుండా.. ఇతర దేశాల్లో కూడా బెల్లాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూనే ఉంటారు. బెల్లంతో అనేక తీపి పదార్థాలను తయారు చేసుకోవచ్చు. డయాబెటీస్ ఉన్న వారు పంచదారకు బదులు బెల్లాన్ని వాడటం వల్ల బ్లడ్ లో షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. బెల్లంలో క్యాల్షియం, పోటాషియం, సోడియం, ఐరన్, వంటి పోషకాలు ఉండటం వల్ల అనేక సమస్యల నుంచి దూరం చేస్తుంది. రోజూ కొంత మోతాదులో బెల్లం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బెల్లంలో ఉండే ఔషధ గుణాలతో ఆయుర్వేదంలో కూడా అనేక అనేక అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఉపయోగిస్తారు. మరి బెల్లం తినడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు:
బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ తో పోరాడడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
జీర్ణ క్రియను పెంచుతుంది:
బెల్లం తినడం వల్ల శరీరంలోని జీర్ణ ఎంజైమ్ లను ప్రేరేపిస్తుంది. దీని వల్ల జీర్ణ క్రియ అనేది మెరుగు పడుతుంది. దీంతో అజీర్ణం, మల బద్ధకం వంటి అపాన వాయువు వంటి జీర్ణ రుగ్మతలను నివారించుకోవచ్చు.
కాలేయాన్ని డీటాక్సి ఫై చేస్తుంది:
బెల్లం సహజ నిర్విషీకరణగా పరి చేస్తుంది. శరీరం నుండి విషాన్ని బయటకు పంపడం ద్వారా కాలేయాన్ని శుభ్ర పరిచేందుకు హెల్ప్ చేస్తుంది.
యాక్టీవ్ చేస్తుంది:
బెల్లంలో కార్బోహైడ్రేడ్స్ ఉండటం వల్ల నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తుంది. దీని వల్ల రోజంతా ఫ్రెష్ గా ఉండొచ్చు.
నెలసరి నొప్పిని తగ్గిస్తుంది:
బెల్లం ఐరన్, ఫోలేట్ వంటి కంటెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే రక్త ప్రసరణను నిర్వహించడానికి, పీరియడ్స్ టైమ్ లో వచ్చే నొప్పి, తిమ్మిరి వంటివి తగ్గించడంలో బెల్లం హెల్ప్ చేస్తుంది.
రక్త హీనతను తగ్గిస్తుంది:
బెల్లంలో ఇనుము కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. రక్త హీనతతో బాధ పడేవారు బెల్లాన్ని రెగ్యులర్ గా తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచేందుకు సహాయ పడుతుంది.
చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది:
బెల్లం తింటే రక్తం క్లీన్ అవుతుంది. రక్తం శుభ్ర పడటంతో చర్మం కూడా క్లియర్ అవుతుంది. దీంతో చర్మంపై ఉండే పింపుల్స్, ఇతర చర్మ వ్యాధులను నివారించడంలో సహాయ పడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.