ప్రపంచంలో కాలుష్యం రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా పట్టణాల్లో కాలుష్యం(Pollution) భాగా పెరిగిపోతుంది. ఎటుచూసినా పొగచూరిన వాతావరణం. నిండా కాలుష్యం. దానిపాటు అలవాట్లు అన్ని కలిసి ఊపిరితిత్తుల సమస్యలకు కారణమవుతుంది. ముఖ్యంగా లంగ్ కేన్సర్(Lungs Cancer) ప్రధాన సమస్యగా మారింది. లంగ్ కేన్సర్(Cancer))ను ఎలా గుర్తించవచ్చో చూద్దాం. ప్రపంచాన్ని ఇప్పటికీ శాసిస్తున్నది, పీడిస్తున్నది ప్రాణాంతకమైన కేన్సర్ వ్యాధి. మనిషిని నిలువునా కృశింపచేసి.. ప్రాణం తీస్తుంది. చాలా రకాల కేన్సర్‌లు ఉన్నా.. ఊపిరితిత్తుల కేన్సర్ చాలా ప్రమాదకరమైందిగా ఉంది. ఎందుకంటే ఇది చాలా త్వరగా ఊపిరితిత్తులను నాశనం చేస్తాయి. అందుకే మీ ఊపిరితిత్తుల్ని సంరక్షించుకోవడం చాలా అవసరం. అసలు ఊపిరితిత్తుల కేన్సర్ ఎలా వచ్చిందో కొన్ని సులభమైన లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు.
గోర్లలో మార్పులు
ఊపిరితిత్తుల కేన్సర్ సోకితే.. ఆ వ్యక్తుల వేలి గోర్లు విచిత్రంగా ఆకారం మారతాయి. ఉబ్బెత్తుగా, విభిన్నమైన ఆకారంలో ఉంటాయి. వేళ్ల పైభాగం ఎఫెక్ట్ అవుతుంది. కాలిగోర్లతో కూడా మార్పు వస్తుంది. ఫింగర్ క్లబ్ జరిగితే ఊపిరితిత్తుల కేన్సర్‌గా నిర్ధారణ చేయవచ్చు. ఫింగర్ క్లబ్ వల్ల కేన్సర్ సోకిందని చెప్పవచ్చంటున్నారు పరిశోధకులు., గోర్లు మృదువుగా మారడం లేదా లేచినట్టు అన్పించడం కేన్సర్ లక్షణాలే. ఇక ఊపిరితిత్తుల కేన్సర్‌కు ఇంకొన్ని ఇతర లక్షణాలు కూడా ఉన్నాయి. తరచూ దగ్గు ఎక్కువగా ఉండటం, ఛాతీలో నొప్పి ప్రధాన లక్షణాలు. శ్వాస తీసుకోవడంలో తరచూ ఇబ్బంది ఎదుర్కోవడం, దగ్గుతున్నప్పుడు రక్తం కారడం, తీవ్రమైన అలసట, బరువు విపరీతంగా తగ్గడం కేన్సర్ లక్షణాలుగా చెప్పవచ్చు. ఊపిరితిత్తుల కేన్సర్ సమస్యను రక్షించుకోవాలంటే..ముందుగా ధూమపానానికి దూరంగా ఉండాలి. చుట్టుపక్కల ఎవరైన ధూమపానం చేస్తుంటే దూరంగా ఉండండి. ఎందుకంటే పాసివ్ స్మోకింగ్ కూడా డేంజర్. ఇక పనులు చేసేటప్పుడు కార్సినోజెన్స్‌కు దూరంగా ఉండాలి. సిమెంట్, దుమ్ము, ధూళికి దూరంగా ఉండాలి.
(నోట్: ఇందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే ముందుగా వైద్యులను సంప్రదించండి.)
Read Also.. Storing Bananas: అరటిపండ్లు త్వరగా కుళ్ళిపోతున్నాయా.. ఈ చిట్కాలను పాటించండి..