
ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అత్యంత ప్రభావవంతమైన కొత్త HIV ( (హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్) నివారణ ఔషధాన్ని ఆమోదించిందని గిలియడ్ సైన్సెస్ బుధవారం నివేదించింది. క్లినికల్ ట్రయల్స్‌లో ప్రతి ఆరు నెలలకు ఇంజెక్షన్ ఇచ్చిన వ్యక్తులలో HIV వ్యాప్తిని దాదాపుగా తగ్గిపోయింది. యెజ్టుగో బ్రాండ్ పేరుతో లెనాకాపావిర్‌ను ఆమోదించింది. ఇది రెండు దశాబ్దాలకు పైగా తయారీలో ఉంది. HIV నివారణకు లెనాకాపావిర్‌ను US వెలుపల ఏ నియంత్రణ సంస్థ ఆమోదించలేదు. ప్రస్తుతం HIV (AIDS)కు చికిత్స లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ హెచ్‌ఐవీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీనిని నివారించేందుకు ఏన్నో ఏళ్లుగా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి.
లైంగిక సంబంధం ద్వారా HIV సంక్రమించే ప్రమాదం ఉన్న కనీసం 35 కిలోల బరువున్న పెద్దలు, కౌమారదశలో ఉన్నవారిలో ఈ ఇంజెక్షన్ ఔషధాన్ని ఉపయోగించడానికి ఆమోదం లభించింది. అధ్యయన కాలంలో యెజ్టుగో పొందిన వారిలో 99.9% కంటే ఎక్కువ మంది HIV-నెగటివ్‌గా ఉన్నారని క్లినికల్ ట్రయల్ డేటా చూపిస్తుంది. హెచ్‌ఐవీ (HIV) ఇన్ఫెక్షన్లను నివారించడంలో బలమైన సామర్థ్యం ఉన్నట్లు గుర్తించారు.
దశాబ్దాలుగా HIV కి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఇది ఒక చారిత్రాత్మక రోజు. యెజ్టుగోను సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని, ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది హెచ్‌ఐవీని నివారించవచ్చని గిలియడ్ సైన్సెస్ CEO డేనియల్ ఓ’డే అన్నారు.
గిలియడ్ తయారు చేసిన మొదటి PrEP ఔషధం 2012లో ఆమోదం పొందింది. కానీ 2022 నాటికి USలో PrEPకి అర్హులైన ప్రతి ముగ్గురిలో ఒకరికి మాత్రమే దీనిని సూచించారని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) తెలిపింది. చాలా మంది ప్రజలు ముఖ్యంగా మహిళలు, నల్లజాతి, లాటినో కమ్యూనిటీలు, యూఎస్ దక్షిణ ప్రాంతంలోని ప్రజలకు అవగాహన లేకపోవడం, రోజువారీ మందులను తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు. సంవత్సరానికి రెండుసార్లు టీకాలు వేయడం వలన హెచ్‌ఐవీని నివారించవచ్చని ఎమోరీ విశ్వవిద్యాలయంలో మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ కార్లోస్ డెల్ రియో అన్నారు.
ఇది ఎలా పనిచేస్తుంది
యెజ్టుగోలో లెనాకాపావిర్ అనే ప్రత్యేకమైన యాంటీరెట్రోవైరల్ ఉంటుంది. ఇది దాని జీవిత చక్రంలో బహుళ దశలలో HIV (హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్)ని నిరోధించడం ద్వారా పనిచేస్తుంది. చాలా మందులు ఒకదానిని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటాయి. ఈ వ్యాక్సిన్ శరీరంలో 12 నెలల వరకు ఉంటుందని చెబుతున్నారు.