పుచ్చకాయ.. వేసవిలో విరివిగా లభించే పండు. ఇది దాహాన్ని తీరుస్తుంది. అంతేకాకుండా..ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో అనేక రకాల పోషకాలు.. విటమిన్స్, ఖనిజాలు ఉంటాయి. అంతేకాకుండా.. డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది. అలాగే చర్మాన్ని పొడిబారకుండా…హైడ్రేట్‌గా ఉండేలా చేస్తుంది. అయితే పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు అని అంటుంటారు. పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగితే పలు రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని పెద్దలు అంటుంటారు. నిజమే. పుచ్చకాయ తిన్న తర్వాత నీళ్లు తాగితే ప్రమాదమే అంటున్నారు నిపుణులు. ఎందుకో తెలుసుకుందామా.
పుచ్చకాయలో 6 శాతం చెక్కర ఉంటుంది. అలాగే 92 శాతం నీరు ఉంటుంది. అంటే నీరు శాతం పుచ్చకాయలో ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది తిన్న వెంటనే నీళ్లు తాగితే వాటర్ కంటెంట్ పెరిగి.. వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయి.. అలాగే.. పుచ్చకాయ తిన్న తర్వాత నీరు తాగితే డీహైడ్రేట్ సమస్య కలుగుతుంది.
పుచ్చకాయ తిన్న తర్వాత నీళ్లు తాగితే శరీరం బరువెక్కడంతోపాటు.. జీర్ణక్రియ నెమ్మదిగా ప్రారంభమై చక్కెరను జీర్ణంచేయడానికి ఇబ్బంది కలుగుతుంది. కడుపు నొప్పి సమస్య ఉన్నవారు పుచ్చకాయ తిని వెంటనే నీరు తాగితే వికారం కలుగుతుంది. అలాగే పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగడం వలన శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ అవుతాయి. పుచ్చకాయ, నీరు కలిపి తీసుకుంటే.. శరీరంలోని కణాల పనితీరు తగ్గిపోతుంది. ఫలితంగా బలహీనంగా ఉంటారు.
గమనిక :- ఈ కథనం కేవలం నిపుణుల సూచనలు.. అధ్యాయనాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ముందుగా వైద్యులను సంప్రదించి సలహాలు తీసుకోవాలి.
Also Read: Mahesh Babu: మరోసారి వెండితెరపై అలనాటి నటి.. మహేష్‌కు పిన్నిగా ఆ హీరోయిన్..
Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ ఇంట తీవ్ర విషాదం.. గుండెపోటుతో అశ్విని తండ్రి మృతి..
Samantha: సమంత జిమ్‌కు వెళ్లడానికి అతడే కారణమంటా.. వైరల్ అవుతోన్న పాత వీడియో..