Lemon Water: రోజూ ఉదయాన్నే నిమ్మరసం తాగుతున్నారా ? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే.. ఎందుకో తెలుసా..  

|

Jan 08, 2022 | 6:05 PM

సాధారణంగా చాలా మందికి రోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు. అలాగే కొందరికి పరగడుపున గోరువెచ్చని

Lemon Water: రోజూ ఉదయాన్నే నిమ్మరసం తాగుతున్నారా ? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే.. ఎందుకో తెలుసా..  
Lemon Water
Follow us on

సాధారణంగా చాలా మందికి రోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు. అలాగే కొందరికి పరగడుపున గోరువెచ్చని నీటిలో తేనే కలుపుకుని తాగుతారు. అలాగే మరికొందరు నిమ్మరసం తాగుతుంటారు. ఈరోజు ఉదయాన్నే ఖాళీ కడపుతో నిమ్మరసం తాగితే బరువు తగ్గుతారు. అలాగే అనారోగ్య సమస్యలను తగ్గించి రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. కాలాలు మారుతున్న సమయంలో వైరల్ ఇన్ఫెక్షన్స్.. అనారోగ్య సమస్యలను తగ్గించడంలోనూ నిమ్మరసం ఉపయోగపడుతుంది. అయితే ఇన్ని ప్రయోజనాలు అందించే నిమ్మరసంను రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి హాని కల్గుతుందట. అవెంటో తెలుసుకుందామా.

రోజూ నిమ్మరసం తాగడం వలన దంతాల ఎనామిల్ దెబ్బతింటుంది. అలాగే నిమ్మకాయలో ఉండే యాసిడ్ వలన దంతక్షయం ఏర్పడుతుంది. అలాగే నిమ్మరసంను ఎక్కువగా తాగడం వలన గుండెల్లో మంట.. వికారం వస్తుంది. నిమ్మరసంను రోజూ తాగడం వలన కడుపు నొప్పి కలుగుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువవుతాయి. ఇందులో ఆస్కార్బిక్ యాసిడ్ లేదా విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. దీంతో తరచూ మూత్రవిసర్జన సమస్య ఎదుర్కోవలసి వస్తుంది. నిమ్మకాయలో ఉండే యాసిడ్ ఎముకలకు హాని కల్గిస్తుంది. అలాగే ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యకు కారణమవుతుంది.

నిమ్మకాయలో విటమిన్ సి ఉండడం వలన ఐరన్ శోషణ పెంచుతుంది. కానీ ఎక్కువ మోతాదులో విటమిన్ సి ఉండడం వలన శరీరంలో ఐరన్ శాతం పెరుగుతుంది. నిమ్మరసంలో ఉంటే సిట్రిక్ యాసిడ్ నోటి పూతలను మరింత తీవ్రం చేస్తుంది. అలాగే చిగుళ్ల సమస్యలను కల్గిస్తుంది.

Also Read: Anupama Parameswaran : ఎర్రచీరలో కిర్రెక్కిస్తున్న కుర్రది.. అందాల అనుపమ లేటెస్ట్ ఫొటోస్..

వెన్నెల్లో వయ్యారాలు ఒలకబోస్తున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా..? అందం అభినయం కలబోసిన ఈ అమ్మడు ఎవరంటే..

Rowdy Boys: సంక్రాంతి కానుకగా రానున్న రౌడీ బాయ్స్.. మూవీ ట్రైలర్ లాంచ్ చేసే స్టార్ హీరో ఎవరంటే..

Sonusood: కీలక నిర్ణయం తీసుకున్న సోనూసూద్‌.. ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన..