బెల్లంలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని.. ముఖ్యంగా శరీరంలో రక్తం పెంచుతుందని అంటారు. రోజూ ఉదయాన్నే కొద్దిగా బెల్లం తినడంలో వలన రక్తహీనత తగ్గుతుంది. కానీ ఏదైనా శ్రుతిమించితే ప్రమాదమే కదా.. ఇన్ని పోషకాలు కలిగిన బెల్లం అధిక మోతాదులో తీసుకున్న కూడా ప్రమాదమే. ఎక్కువగా బెల్లం తీసుకోవడం వలన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఎలాగో తెలుసుకుందామా.
1. బెల్లం అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే బెల్లం ఎక్కువగా తీసుకోవడం ద్వారా బరువు పెరిగే అవకాశాలున్నాయి.. వాస్తవానికి బెల్లంలో పిండి పదార్థాలు, చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది.
2. శీతాకాలమైనా, వేసవికాలమైనా, ఏ సీజన్‌లోనైనా బెల్లం ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ముఖ్యంగా వేసవికాలంలో బెల్లం తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే దీనిని అధికంగా తీసుకోవడం వల్ల ముక్కు నుండి రక్తస్రావం జరుగుతుంది. బెల్లం వేడిని కలుగజేస్తుంది. దీని కారణంగా రక్తస్రావం సమస్యను ఎదుర్కోవచ్చు.
3. బెల్లం అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగే సమస్య కూడా ఏర్పడుతుంది. బెల్లంలో సుక్రోజ్ ఉంటుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది. మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులకు ఇది మరింత హానికరం.
4. బెల్లం అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు కలుగుతాయి. నిజానికి బెల్లంలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. అతిగా తీసుకోవడం వల్ల అతిసారం, కడుపు నొప్పి సమస్యలు కలుగుతాయి. దీంతోపాటు అలసట, తలనొప్పి, భయం వంటి సమస్యలు కూడా సంభవించవచ్చు.
5. బెల్లం అధికంగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య కూడా ఏర్పడుతుంది. బెల్లంలో చక్కెర ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీంతో శరీరంలో మంట సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కీళ్లనొప్పులతో సమస్యలు ఉన్నవారు బెల్లం తీసుకోవడం మానుకోవాలి.
Also Read: Raviteja: మరోసారి హిట్ కాంబో రిపీట్ కాబోతుందా ? సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌తో మాస్ మాహారాజా..