Health Tips: అమర్‌ఫల్‌.. ఈ పండును ఎప్పుడైనా తిన్నారా.. గుండె రోగాలు, ఊబకాయం ఫసక్

|

Nov 01, 2022 | 12:10 PM

ఇప్పుడు భారతదేశంలో కూడా ఈ పండుకు ఆదరణ పెరుగుతోంది. మీరు ఈ పండును ఇంకా తినకపోతే, తప్పకుండా ప్రయత్నించండి. ఇది రుచిగా ఉండటమే కాదు, ఇందులో పోషక విలువలు కూడా పుష్కలంగా ఉన్నాయి.

Health Tips: అమర్‌ఫల్‌.. ఈ పండును ఎప్పుడైనా తిన్నారా.. గుండె రోగాలు, ఊబకాయం ఫసక్
Amarfal
Follow us on

ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో పండ్లను తీసుకోవటం చాలా ముఖ్యం. మీరు దీన్ని చాలాసార్లు వినే ఉంటారు. మార్కెట్‌లో అనేక రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని భారతదేశంలో ఉత్పత్తి చేయబడతాయి. మరి కొన్ని అన్యదేశాల నుండి దిగుమతి చేస్తుంటారు. అయితే, ఇంగ్లీష్‌లో పెర్సిమోన్ అని పిలువబడే అమర్‌ఫల్‌ ఎప్పుడైనా తిన్నారా..? ఈ పండు చైనాకు చెందినది. ఇప్పుడు భారతదేశంలో కూడా ఈ పండుకు ఆదరణ పెరుగుతోంది. మీరు ఈ పండును ఇంకా తినకపోతే, తప్పకుండా ప్రయత్నించండి. ఇది రుచిగా ఉండటమే కాదు, ఇందులో పోషక విలువలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అమర్‌ఫల్‌ తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకోండి.

అమర్‌ఫల్ అద్భుత ఆరోగ్య నిధి. అనేక విటమిన్లు కలిగి ఉంది. ఇందులో విటమిన్ -ఎ పుష్కలంగా లభిస్తుంది. కంటి చూపుకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. వీటితో పాటు విటమిన్ సి, ఇ, కె, బి1, బి2, విటమిన్ బి6, పొటాషియం, కాపర్, మెగ్నీషియం, ఫాస్పరస్, మాంగనీస్‌ కూడా పుష్కలంగా ఉంటాయి. మొత్తంమీద ఈ పండును సహజ మల్టీవిటమిన్‌గా చెబుతారు. బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి ఈ పండు బాగా సహాయపడుతుంది. ఈ పండులో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణ సంబంద సమస్యలు లేకుండా చేస్తుంది. కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేసి తొందరగా ఆకలి వేయకుండా చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి.. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దాంతో అనేక అంటువ్యాధుల నుండి మిమ్మల్ని కాపాడుతుంది.

ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండి..DNA దెబ్బతినకుండా కాపాడుతుంది. అలాగే వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తుంది. ఫ్లేవనాయిడ్స్ మరియు క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండటం వలన గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ పండులో పొటాషియం సమృద్దిగా ఉంటుంది. పొటాషియం వాసోడైలేటర్‌గా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

రక్తపోటును తగ్గించే ఏజెంట్‌గా కూడా అమర్‌ఫల్‌ పనిచేస్తుంది. శరీరంలో వివిధ భాగాలకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. తక్కువ రక్తపోటు, హృదయనాళ వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించడానికి మరియు వివిధ గుండె సంబంధిత పరిస్థితులను నివారించడానికి కూడా సహాయపడుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

(గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.)