బతుకమ్మ పువ్వు తంగేడుతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. ఆ సమస్యలన్నీ దూరం చేస్తుంది..

|

Nov 15, 2022 | 6:18 PM

ఇది ఎక్కువగా కొండ ప్రాంతలలో ఉంటుంది. అలాంటి తంగేడు పూలు, ఆకులు, బెరడు వీటి అన్నింటిలోనూ ఔషధ గుణాలు ఉన్నాయి. తంగేడు మొక్క ను ఏవిధంగా ఉపయోగించాలి.

బతుకమ్మ పువ్వు తంగేడుతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. ఆ సమస్యలన్నీ దూరం చేస్తుంది..
Tangedu Puvvu
Follow us on

ప్రకృతి మనకు దేవుడు ప్రసాదించిన గొప్ప వరం.. అలాంటి ప్రకృతిలో దొరికే ప్రతీది మానవ శ్రేయస్సుకు ఎంతగానో దోహదపడతాయి. మన చుట్టూ ఉండే అనేకరకాల చెట్లు,పూలు,పండ్లు ఇలా ప్రతీ చెట్టులోనూ ఆరోగ్య ప్రయోజనాలు అనేకం దాగి ఉన్నాయి. మానవ శరీరంలో వచ్చే అనేక జబ్బుల్ని తగ్గించే ఎన్నో ఆయుర్వేద గుణాలని కలిగి ఉంటాయి. ఈ కోవకు చెందినదే తెలంగాణ రాష్ట్ర పుష్పంగా గుర్తింపు పొందిన తంగేడు పువ్వులోనూ ఎన్నో ఔషధ గుణాలు దాగివున్నాయి. బతుకమ్మ పండుగలో ప్రధాన్యత గలది ఈ తంగేడుపువ్వు. ఇది ఎక్కువగా కొండ ప్రాంతలలో ఉంటుంది. అలాంటి తంగేడు పూలు, ఆకులు, బెరడు వీటి అన్నింటిలోనూ ఔషధ గుణాలు ఉన్నాయి. తంగేడు మొక్క ను ఏవిధంగా ఉపయోగించాలి. వాటి వలన కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం…

  • తంగేడు పువ్వుల పొడిని ముల్తానీ మట్టితో కలుపుకుని ముఖానికి రాసుకుంటే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.
  • తంగేడు ఆకులు, మెంతులు కలిపి మజ్జిగలో మెత్తగా నూరి. తలపై ఉంచి ఆముదం ఆకుతో ఆ మిశ్రమాన్ని కప్పి ఉంచి గంట తరువాత స్నానం చేయాలి.. ఇలా చేస్తే శరీరం చల్లబడుతుంది.
  • తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు తంగేడు లేత చిగుళ్లను మాడు మీద పెట్టి బట్టతో కట్టడంవల్ల తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా కంటి రోగాలను నివారిస్తుంది.
  • ఈ తంగేడు పువ్వు రేకుల కషాయాన్ని తాగితే మధుమేహం రాదంటున్నారు ఆయుర్వేద నిపుణులు. తంగేడు పువ్వుల రేకులు, నల్ల వక్కల పొడి ఓ స్పూన్, రెండు గ్లాసుల మంచి నీటిలో మరిగించి ఆ నీటిని వడగట్టి తాగడం ద్వారా చక్కెర స్థాయిలు తగ్గుతాయని సూచిస్తున్నారు.
  • మలబద్దక సమస్యతో బాధపడుతున్న వాళ్లు తంగేడి ఆకులను నీడలో ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని గోరువెచ్చని నీటితో తాగడం వల్ల మలబద్దక సమస్య తగ్గుతుంది.
  • తంగేడు చెట్టు వేరుతో కాషాయం చేసుకొని తాగడం వల్ల నీళ్ల విరోచనాలు తగ్గుతాయి. అంతేకాకుండా తంగేడు బెరడును నమిలి రసం మింగినా కూడా విరేచనాలు తగ్గుతాయి.
  • అతి మూత్రం సమస్యలతో బాధపడుతున్న వాళ్లు తంగేడు విత్తనాలను పొడిచేసి ఆ పొడి 3 గ్రాములు తీసుకుని అందులోకి తేనె కలిపి తీసుకోవడం వల్ల సమస్య తగ్గుతుంది.
  • దగ్గుతో ఎక్కువ బాధపడుతున్నప్పుడు తంగేడు చెట్టు లేత ఆకులను బాగా నమిలి మింగడం వల్ల దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. తంగేడు చిగుళ్లను బాగా దంచి తేలు కుట్టిన చోట పెట్టడం వల్ల విషం విరిగి మంట తగ్గుతుంది.
  • పాదాల పగుళ్ల నొప్పి తో బాధ పడుతున్నప్పుడు లేత ఆకులను మజ్జిగతో కలిపి నూరి పాదాలకు రాయడం వల్ల నొప్పులు తగ్గుతాయి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి