
వేడివేడి అన్నంలో కాస్త పప్పు, నెయ్యి వేసుకుని తింటే.. ఆహా.. ఎంత రుచిగా ఉంటుంది? కానీ, ఇప్పుడంతా కాలరీల లెక్క కదా.. అందుకే నెయ్యంటే అయ్యబాబోయ్… అంటున్నారు. నెయ్యి తింటే వెయిట్ పెరిగిపోతారని చాలామంది నెయ్యిని నెగ్లెట్ చేస్తున్నారు. కాస్త ఘాటెక్కువగా ఉన్నా కూరలో రెండు చుక్కల నెయ్యి వేస్తానన్నా.. వద్దనేస్తున్నారు. కానీ, రోజూ రెండు చెంచాల ఆవునెయ్యి తింటే ఎంత మేలో తెలుసా… ఇది మేమంటున్న మాట కాదు.. పలు అధ్యయనాలు చెబుతున్నమాట.
తినేటప్పుడు మొదటి ముద్దలో రెండు చుక్కలు నెయ్యి కలుపుకొని తింటే.. తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేయడమే కాదు.. గ్యాస్ సంబంధిత సమస్యలనూ దరి చేరనివ్వదు. నెయ్యిలో పోషకాల మోతాదూ ఎక్కువేనట. ముఖ్యంగా కంటిచూపుని మెరుగుపరిచే విటమిన్ ఎ ఇందులో పుష్కలంగా దొరుకుతుంది. అంతేకాదు, దీని నుంచి మనకి అందే మంచి కొవ్వులు అధికబరువునీ అదుపులో ఉంచుతాయట. అలానే విటమిన్ ‘ఇ’ కాలేయాన్ని కాపాడుతుంది. హర్మోన్ల సమతుల్యతకు దోహదపడుతుంది.
వ్యాధినిరోధక శక్తి తక్కువగా వుండేవారు , నెలసరి ఇబ్బందులతో బాధపడేవారు తప్పనిసరిగా రోజూ రెండు చుక్కలైనా నెయ్యివేసుకుని తింటే… ఇది అధిక రక్తస్రావాన్నీ, నొప్పులనీ నివారిస్తుందట. ఇందులో ఉండే బ్యూటెరిక్ ఆమ్లం వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. కాల్షియం దంత, ఎముక సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. ఒంట్లోని మలినాలను పోగొడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.. వీటిని ప్రయోగించేముందు మీ వైద్యుల సలహా తీసుకొని పాటించడం మంచిది.
ఇది చదవండి: ఉన్నట్టుండి నిద్రపోతున్న చిన్నారి ఉయ్యాల పైకెక్కిన కింగ్ కోబ్రా.. ఆ తర్వాత ఇది సీన్..
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..