వారికి మద్యం విషం లాంటిదంట.. ప్రాణాలు డేంజర్‌లో పడేసినట్లే.. బీకేర్‌ఫుల్

|

Oct 21, 2024 | 6:42 PM

మూత్రపిండాలు మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవాలు.. కిడ్నాల్లో ఏదైనా సమస్య ఉంటే శరీరంలోని వడపోత ప్రక్రియ ప్రతికూలంగా ప్రభావితమవుతుంది.. నిర్విషీకరణలో సమస్యలు తలెత్తుతాయి.. మద్యం తాగడం మూత్రపిండాలకు తీవ్ర హాని కలిగిస్తుంది.. వాటి పనితీరును దెబ్బతీస్తుంది. ఆల్కహాల్‌ను మానేయడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా మూత్రపిండాలను కాపాడుకోవచ్చు.

వారికి మద్యం విషం లాంటిదంట.. ప్రాణాలు డేంజర్‌లో పడేసినట్లే.. బీకేర్‌ఫుల్
Alcohol Drinking
Follow us on

కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు మద్యం తాగడం ప్రమాదకరమని.. ఇది చాలా తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కిడ్నీలు మన శరీరంలోని మురికిని ఫిల్టర్ చేసే ఫిల్టర్‌లా పనిచేస్తాయి. కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, మనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి.. కానీ కొందరు వ్యక్తులు అధిక ఆల్కహాల్ వ్యసనానికి గురవుతారు. ఇది మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. మద్యపానం మన కిడ్నీలను ఎలా దెబ్బతీస్తుంది.. నిపుణులు చెబుతున్న సూచనలు ఏంటో తెలుసుకోండి..

కిడ్నీలకు ఆల్కహాల్ ఎలా హాని కలిగిస్తుంది..

వాస్తవానికి రక్తంలో చేరుతున్న వ్యర్థాలను గాలించి, వడపోసి, శుభ్రం చేసే పని మూత్రపిండాలది. ఈ మూత్రపిండాలు విరామం లేకుండా పనిచేసి రక్తాన్ని శుభ్రంగా ఉంచుతాయి. అయితే.. కిడ్నీ రోగులకు ఆల్కహాల్ తీసుకోవడం చాలా ప్రమాదకరం.. ఎందుకంటే ఆల్కహాల్ మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతుంది, మూత్రపిండాల పనితీరును కష్టతరం చేస్తుంది. ఆల్కహాల్ మూత్రపిండాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.. వాటి ప్రభావాన్ని తగ్గిస్తుంది. కిడ్నీ రోగులు అధికంగా ఆల్కహాల్ తీసుకుంటే, అది వారి కిడ్నీలను పూర్తిగా దెబ్బతీస్తుంది.. వ్యాధి నయం అవుతుందనే పరిస్థితే ఉండదు.. ఒక్కోసారి వైద్య అత్యవసర పరిస్థితి ఏర్పడవచ్చు.. ప్రాణాంతకంగా కూడా మారవచ్చు..

మూత్రపిండాల పనితీరుపై ప్రభావం..

కిడ్నీ రోగులకు, మద్యపానం మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ప్రత్యేకించి వారు ఇప్పటికే మూత్రపిండాల వ్యాధిని ఎదుర్కొంటుంటే.. వాటి పరిస్థితి మరింత దిగజారవచ్చు.. అదనంగా, మద్యపానం మానసిక ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది.. కిడ్నీ సమస్యలు, మానసిక ఆరోగ్యం.. ఇలా రోగుల పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారుతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

కిడ్నీ పేషెంట్లు వీలైనంత త్వరగా మద్యపానాన్ని వదులుకోవడానికి ప్రయత్నించాలి.. ఈ పని ఎంత కష్టంగా అనిపించినా, మీరు దీన్ని నియంత్రించినట్లయితే దీర్ఘకాలికంగా మీ కిడ్నీలు పాడైపోకుండా కాపాడుకోవచ్చు.. ఇంకా అత్యవసర పరిస్థితిని నివారించవచ్చు. ఆల్కహాల్ వల్ల కలిగే అన్ని ఇతర దుష్ప్రభావాలు, వ్యాధులను నివారించే అవకాశాన్ని కూడా పొందవచ్చు..

మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పానీయాలు

మీరు ఆల్కహాల్‌ను మానుకున్న తర్వాత.. మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కొన్ని ఆరోగ్యకరమైన పానీయాలను త్రాగాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. బీట్‌రూట్ రసం, నిమ్మరసం, అల్లం రసం, కొబ్బరి నీరు, పుదీనా నీరు లాంటివి కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి..

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..