చాలా మంది చాయ్(Tea) తాగేటప్పుడు బిస్కేట్(Biscuit), బ్రెడ్, కారిలు లేదా చపాతి వేసుకుని తింటారు. ముఖ్యంగా బిస్కేట్ చాయ్‌తో పాటు తీసుకుంటారు. దాదాపుగా రోజూ ఉదయం లేవగానే చాయ్ తాగుతారు. ఉదయం పూట పరగడుపున లేదా సాయంత్రం పూట స్నాక్స్(Sanks) సమయంలో లేదా మద్యమధ్యలో చాలామందిలో సర్వ సాధారణంగా కన్పించే అలవాటు టీలో బిస్కేట్ వేసుకుని తినడం. తెలిసో తెలియకో ఆహారపు అలవాట్లలో ఇదొక భాగమైపోయింది. మీకు కూడా టీ లేదా కాఫీతో పాటు బిస్కేట్లు తినే అలవాటు ఉంటే..వెంటనే మానేయడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. టీ బిస్కేట్ కాంబినేషన్ రెసిపీ ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు. ఈ రెండూ కలిపి తీసుకుంటే కలిగే దుష్పరిణామాలు చాలా ఎక్కువ అని చెబుతున్నారు.
బిస్కేట్‌లో హైడ్రోజెనెటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. బిస్కేట్ అనేది ఎప్పుడూ ఫ్యాట్ లేకుండా ఉండదు. అందుకే దీర్ఘకాలం బిస్కేట్లు తింటే ఆరోగ్యానికి మంచిది కాదు.. ఫలితంగా లావెక్కే ప్రమాదముందంటున్నారు. ఎక్కువకాలం టీ లేదా కాఫీతో తీపి బిస్కట్లు తింటే బ్లడ్ సుగర్ స్థాయి పెరుగుతుందట. అంతేకాకుండా సోడియం స్థాయి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్, థైరాయిడ్ రోగులు బిస్కేట్ అస్సలు తినకూడదట. బిస్కేట్‌లో అధికంగా ఉండే షుగర్ కారణంగా రోగ నిరోధకశక్తి తగ్గిపోతుందన్నారు.
బిస్కేట్‌ను రిఫైండ్ పిండితో తయారు చేస్తారు. ఇందులో ఫైబర్ కంటెంట్ ఉండదు. ఫలితంగా బిస్కేట్లు ఎక్కువ తినడం వల్ల మలబద్ధకం సమస్య కూడా ఏర్పడుతుంది. అదే సమయంలో బిస్కేట్ లేదా కుకీస్‌లో బీహెచ్‌టీ పేరున్న రెండు ప్రిజర్వేటివ్‌లు వేస్తారు. ఇది ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుంది. బిస్కట్ తయారయ్యేది మైదా పిండితో. మైదా పిండిని వైట్ పాయిజన్‌గా కూడా పిలుస్తుంటారు. బిస్కట్‌లో షుగర్ స్థాయి చాలా ఎక్కువగానే ఉంటుంది. రోజూ బిస్కట్లు తినడం వల్ల పళ్లకుండే ఎనామిల్ దెబ్బతింటుంది. దాంతో దంతాల కేవిటీ క్షీణించే అవకాశం ఉంది.
గమనిక: పైన పేర్కొన్న సలహాలు, సూచనలు నిపుణులు తెలిపినవి మాత్రమే. మీరు ఎలాంటి పనులు చేయాలన్నా నిపుణులను సంప్రదించండి.
Read Also.. Liver Health: ఇవి తీసుకుంటే కాలేయం ప్రమాదంలో పడినట్టే.. అవేంటో తప్పనిసరిగా తెలుసుకోండి..