
నిపుణుడు వాడిన CGM (నిరంతర గ్లూకోజ్ మానిటర్) ప్రకారం.. రెండు గంటల తర్వాత కూడా చక్కెర స్థాయిలో పెద్ద మార్పు కనిపించలేదు. ఇది కొబ్బరి నీటితో పోలిస్తే చాలా తక్కువ మార్పు. ఇది ఫ్లాట్ లైన్. అంటే చక్కెర ఎక్కడం లేదు. ఇది మంచి విషయం అని ఆ నిపుణుడు వెల్లడించారు.
ఈ పోషకాల విలువలతో ఇది తక్కువ గ్లైసెమిక్ ఆహారంగా మారుతుంది. అంటే తిన్న తర్వాత చక్కెర శాతం ఒక్కసారిగా పెరగదు.
కొబ్బరిలో ఎక్కువగా ఉండే ఫైబర్ ముఖ్యంగా కరగని ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదిగా చేస్తుంది. ఈ ఫైబర్ కారణంగా గ్లూకోజ్ శరీరంలోకి నెమ్మదిగా విడుదల అవుతుంది. ఇందులో ఉండే MCTలు (మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్లు) శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. ఇవి ఇన్సులిన్ అవసరం లేకుండానే పని చేస్తాయి. మొత్తం 15 గ్రాముల కార్బోహైడ్రేట్లలో 9 గ్రాములు ఫైబర్ కావడంతో శరీరానికి నికరంగా కేవలం 6 గ్రాములు మాత్రమే అందుతాయి. ఇది గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచుతుంది.
డయాబెటిస్ ఉన్నవారు కొబ్బరి మాంసాన్ని స్మార్ట్ స్నాక్ గా తీసుకోవచ్చు. ఇది తక్కువ కార్బోహైడ్రేట్లతో శరీరానికి తృప్తినిచ్చే ఆహారం. 2017లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం MCTలు ఇన్సులిన్ స్పైక్స్ ను తగ్గిస్తాయి. శరీర బరువు తగ్గటానికి కూడా ఇవి సహాయపడతాయి. అయితే తినే పరిమాణాన్ని నియంత్రించాలి. ఎందుకంటే ఇందులో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది.
రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు.. గర్భధారణ సమయంలో మధుమేహం ఉన్నవారు కొవ్వును పరిమితంగా తీసుకోవాలి. తీపి కలిపిన కొబ్బరి ఉత్పత్తులు తినకూడదు. ఇవి చక్కెరను త్వరగా పెంచుతాయి.
కొబ్బరి మాంసం తీపి లేకుండా లేదా ముడి రూపంలో తింటే రక్తంలో చక్కెర శాతం గణనీయంగా పెరగదు. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన పదార్థం. అందుకే మధుమేహం ఉన్నవారు, PCOS ఉన్నవారు లేదా గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచాలనుకునేవారు దీన్ని మితంగా తీసుకుంటే మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)