Eggs: వేసవిలో కోడిగుడ్లు తింటే వేడి చేస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..

|

Apr 03, 2022 | 11:00 AM

కోడిగుడ్లు(Eggs) తినడం శరీరానికి చాలా మంచిది. ఎందుకంటే గుడ్డు సంపూర్ణ ఆహారం కాబట్టి. అయితే ఈ గుడ్డును వేసవి(Summer)లో తినకూడదా అంటే..

Eggs: వేసవిలో కోడిగుడ్లు తింటే వేడి చేస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..
Eggs
Follow us on

కోడిగుడ్లు(Eggs) తినడం శరీరానికి చాలా మంచిది. ఎందుకంటే గుడ్డు సంపూర్ణ ఆహారం కాబట్టి. అయితే ఈ గుడ్డును వేసవి(Summer)లో తినకూడదనేది ఒక అపోహ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. గుడ్ల వల్ల వేడి పెరుగుతుందనేది వాస్తవమే అయినప్పటికీ.. రోజుకు రెండు గుడ్లను తింటే ఒంట్లో వేడి ఏమీ పెరగదని వివరిస్తున్నారు. గుడ్డు కర్రీ, ఉడకబెట్టిన గుడ్లు, ఎగ్ ఆమ్లెట్(Egg Omlet), చీట్ ఆమ్లెట్ ఇలా గుడ్డుతో ఏది చేసినా.. ఇష్టంగా తినేవారు చాలా మందే ఉన్నారు. ఈ గుడ్డు మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎందుకంటే గుడ్డులో ఎన్నో పోషకవిలువలున్నాయి. గుడ్డులో విటమిన్ బి, విటమిన్ డి, జింక్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలో ఉండే అమైనో ఆమ్లాలు, సల్ఫర్ ఆరోగ్యంగా ఎదిగేందుకు ఉపయోగపడతాయి.

ఇక వేసవిలో గుడ్లు తినకూడదని అంటారు చాలా మంది. అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, దీని వెనుక ఎటువంటి శాస్త్రీయ నిజం లేదు. వేసవిలో గుడ్లకు దూరంగా ఉండాలనేది అపోహ మాత్రమే. కొన్ని ఆహారాలు శరీరానికి చలవనిచ్చేవి వుంటే, మరికొన్ని వేడిగా ఉంటాయి. అన్నింటికంటే ముఖ్యమైనది ఏమిటంటే, దేన్నైనా మితంగా తీసుకోవడం మంచిది. ఈ ఎండాకాలంలో రోజుకు రెండు గుడ్లను తింటే ఒంట్లో వేడి ఏమీ పెరగదట. రెండు కంటే ఎక్కువ గుడ్లను తింటేనే ఒంట్లో వేడి ఎక్కువవుతుంది. కాబట్టి ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా ఎంచక్కా రోజుకు రెండు గుడ్లను తినండి. అప్పుడే ఈ ఎండాకాలం ఆరోగ్యంగా ఉంటారు.

గుడ్లను తినడం వల్ల మీ వెయిట్ లాస్ కూడా అవ్వొచ్చు. గుడ్డును తినడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీంతో మీరు ఎక్కువగా ఫుడ్ ను తీసుకోలేరు.ఉదయాన్నే గుడ్లు తినడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది, తద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అయితే వేసవిలో సహజంగానే ఆకలి ఎక్కువ అవుతుంది. ఎండ వేడిమికి శరీరానికి చమట పడుతుంది.. దాంతో త్వరగా నీరసం వచ్చి ఆకలి అనిపిస్తుంది.. ఏమైనా తినాలని అనిపిస్తుంది.. గుడ్డు తింటే పొట్ట నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది.. ఆకలి తగ్గుతుంది.

Note: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

Read Also.. Pulses in Summer: వేసవిలో ఈ పప్పు దినుసులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. మంట, వేడికి ఇలా చెక్ పెట్టొచ్చు..