
ఇది వర్షాకాలం.. అంటే జ్వరాల సీజన్. వాతావరణ మార్పు, వర్షాలు, సీజనల్ వ్యాధుల వ్యాప్తి.. ఇలా కారణం ఏదైనా ఈ కాలంలోనే చాలా మంది అనారోగ్యానికి గురవుతుంటారు. ఎక్కువమంది జ్వరంతో బాధపడతారు. అయితే మన పెద్దలు కనీసం ఏడాదికి ఒక్కసారైన జ్వరం రావాలని అంటూ ఉంటారు. ఈ మాట మీరు కూడా వినే ఉంటారు. వాళ్లు అలా ఎందుకు అంటారు? దాని వెనుక కారణాలు ఏంటి? జ్వరం వస్తే మంచిదేనా? ఇలాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
చాలా మందికి జ్వరం అంటే కేవలం అనారోగ్యానికి సిగ్నల్ అనుకుంటారు కానీ నార్మల్ ఫీవర్ వస్తే మన బాడీ ఇన్‌ఫెక్షన్‌తో పోరాడేందుకు ఉపయోగించే సహజ రక్షణ వ్యవస్థలో భాగంగా పనిచేస్తుంది. అయితే అధిక జ్వరం లేదా ఎక్కువ రోజులు కొనసాగే జ్వరం మాత్రం ప్రమాదకరమనే విషయం గుర్తుంచుకోవాలి. అయితే నార్మల్ ఫీవర్ వల్ల కలిగే ఉపయోగలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
అయితే జ్వరం వస్తే మంచిదే కదా అని జ్వరం వచ్చినప్పుడు నిర్లక్ష్యంగా ఉండటం మంచిది కాదు. 103°F (39.4°C) లేదా అంతకంటే ఎక్కువ జ్వరం ఉన్నా, జ్వరం 2–3 రోజులకంటే ఎక్కువ కొనసాగినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన తలనొప్పి, మూర్ఛ, గందరగోళం వంటి లక్షణాలు కనిపించినా, చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణులు లేదా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి జ్వరం వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఒక్క విషయం.. జ్వరం అనేది వ్యాధి కాదు. వ్యాధికి శరీరం ఇచ్చే సహజ ప్రతిస్పందన. స్వల్ప జ్వరం శరీరానికి కొంత మేర ప్రయోజనకరంగా ఉండొచ్చు. కానీ అధిక జ్వరం పెరిగిన లేదా ఎక్కువకాలం కొనసాగితే మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్లాలి.