Air Quality: పాఠశాలల్లోని తరగతి గదుల్లో గాలి నాణ్యత మెరుగుపడితే కోవిడ్, ఆస్తమా, అలర్జీలు వచ్చే ప్రమాదం ఉండదు: పరిశోధనలో వెల్లడి

|

Oct 10, 2022 | 8:47 AM

ప్రపంచంలో కోవిడ్ మహమ్మారి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. కానీ అది ఇంకా పూర్తిగా తగ్గలేదు. భారత్, అమెరికా సహా అనేక దేశాల్లో ఇప్పటికీ కోవిడ్ ప్రభావం ఉంది..

Air Quality: పాఠశాలల్లోని తరగతి గదుల్లో గాలి నాణ్యత మెరుగుపడితే కోవిడ్, ఆస్తమా, అలర్జీలు వచ్చే ప్రమాదం ఉండదు: పరిశోధనలో వెల్లడి
School Air Quality
Follow us on

ప్రపంచంలో కోవిడ్ మహమ్మారి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. కానీ అది ఇంకా పూర్తిగా తగ్గలేదు. భారత్, అమెరికా సహా అనేక దేశాల్లో ఇప్పటికీ కోవిడ్ ప్రభావం ఉంది. యుఎస్‌లో శీతాకాలం ప్రారంభం కావడంతో తరగతి గదుల్లో గాలి వచ్చేలా చర్యలు తీసుకోవడం చాలా పాఠశాలలకు సవాలుగా ఉంటుంది. అదే సమయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆరోగ్యకరమైన సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందించడం కూడా కష్టం. పాఠశాలల్లోని తరగతి గదుల్లోని గాలి నాణ్యతను మెరుగుపరచడం ద్వారా కోవిడ్ వంటి వ్యాధులు, ఆస్తమా, అలర్జీ వంటి శ్వాసకోశ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. బోస్టన్ యూనివర్శిటీకి చెందిన ప్యాట్రిసియా ఫాబియన్, జోనాథన్ లెవీ ఈ విషయంలో ఒక పరిశోధనా అధ్యయనం ఆధారంగా ఈ సమాచారాన్ని అందించారు.

గాలి నాణ్యత కారణంగా అధ్యయనాలు ప్రభావితమయ్యాయి:

పిల్లలు, ఉపాధ్యాయులు పాఠశాలలో తరగతి గదులలో రోజుకు సగటున ఆరు గంటలకు పైగా గడుపుతారు. ఈ తరగతి గదులు తరచుగా దశాబ్దాల నాటి భవనాలలో ఉంటాయి. తగినంత గాలి, వెలుతురు, వెండి ఇలా సరిగ్గా వెంటిలేషన్ లేని భవనాలలో ఉంటాయి. ఈ సంవత్సరం శరదృతువు సీజన్‌లో కోవిడ్-19 కారణంగా చదువులు ప్రభావితమయ్యాయి. ఈ సందర్భంగా పాఠశాలల్లో గాలి నాణ్యత ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఆదర్శవంతంగా అన్ని పాఠశాల భవనాలు తగినంత వెంటిలేషన్, ప్రతి తరగతి గదిలో స్వచ్ఛమైన గాలి, ఓపెన్ విండోలను కలిగి ఉండాలి. కానీ అలాంటిదేమి ఉండకపోవడంతో పలు పాఠశాలల్లో గాలి నాణ్యత క్షీణించిందని పరిశోధకులు గుర్తించారు.

యూఎస్‌ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఆగస్టు 2022లో పాఠశాలలకు కోవిడ్-19 మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం ఇన్‌ఫెక్షన్‌ను నివారించడానికి మాస్క్‌లు ధరించడం, పరీక్షించడం, ఐసోలేషన్ వంటి నియమాలు తీసుకోవాలి. కోవిడ్‌ తగ్గిన తర్వాత మళ్లీ నిబంధనలు మొదటికొచ్చాయి. దీని కారణంగా మెల్లమెల్లగా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన పెరిగింది. కోవిడ్‌-19 వ్యాప్తిని తగ్గించడమే కాకుండా తరగతి గదిలోని గాలి నాణ్యత విద్యార్థుల విద్యా పనితీరుకు కూడా ముఖ్యమైనది. మహమ్మారి ఒకటి, రెండు సంవత్సరాలలో పిల్లల తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

వాతావరణం ఆధారంగా పరిశోధన

పరిశోధకుల ఈ పరిశోధన అంతర్గత వాతావరణం, ఆరోగ్యంపై దృష్టి పెట్టింది. కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్ చాలా వరకు ఇండోర్ గాలి ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి ఇండోర్ వాతావరణం ముఖ్యం. పాఠశాల భవనాలలో సరైన వెంటిలేషన్ అంటు వ్యాధి వ్యాప్తిని తగ్గించగలదని గణనీయమైన ఆధారాలు ఉన్నాయి. అదే సమయంలో ఇది విద్యార్థులు, ఉపాధ్యాయులు, నిర్వాహకులకు వాతావరణాన్ని, ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తుందని తెలిపారు. కోవిడ్ నియంత్రణకు భారీ మొత్తం వెచ్చించారు. 2020 నుండి కోవిడ్‌ వ్యాప్తిని తగ్గించే ప్రయత్నాలలో పాఠశాలలు మిలియన్ల డాలర్లను పెట్టుబడి పెట్టాయి. వీటి కింద పాఠశాలల్లో అధిక సామర్థ్యం గల దీర్ఘకాలం ఉండే ఫిల్టర్ యూనిట్లు ఏర్పాటు చేయబడ్డాయి. దీని వల్ల గాలి మెరుగుపడింది.

మెకానికల్ వెంటిలేషన్

మెకానికల్ వెంటిలేషన్ ఉన్న పాఠశాలలు ఫిల్టర్ చేసిన స్వచ్ఛమైన గాలిని పెంచగలవు. ఇది అన్ని అంతర్గత కాలుష్య కారకాలను తటస్థీకరిస్తుంది. ఇది పిల్లలకు, పాఠశాల సిబ్బందికి ముఖ్యంగా ఆస్తమా, అలర్జీలకు సున్నితంగా ఉండే వ్యక్తులకు చాలా సహాయకారిగా ఉంటుంది. అందుకే నాణ్యమైన గాలి, విద్య, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చాలా స్పష్టంగా ఉంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి