Immunity Booster Juices: తక్షణమే శక్తిని పొందడం కోసం.. ఈ ఏడు రకాల జ్యూస్‌లు తాగండి.. అవేంటంటే..?

Immunity Booster: ఓ వైపు కరోనా.. మరోవైపు సీజనల్ వ్యాధులు మనషులను వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో మనం ఆరోగ్యవంతంగా ఉండాలంటే.. రోగనిరోధక శక్తి

Immunity Booster Juices: తక్షణమే శక్తిని పొందడం కోసం.. ఈ ఏడు రకాల జ్యూస్‌లు తాగండి.. అవేంటంటే..?
Immunity Booster Juices

Updated on: Sep 21, 2021 | 10:36 AM

Immunity Booster: ఓ వైపు కరోనా.. మరోవైపు సీజనల్ వ్యాధులు మనషులను వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో మనం ఆరోగ్యవంతంగా ఉండాలంటే.. రోగనిరోధక శక్తి చాలా అవసరం. అయితే.. రోగనిరోధకశక్తిని పెంచే ఆహార పదార్థాలు వంటగదిలో అనేకం అందుబాటులో ఉన్నాయి. రోగనిరోధక శక్తి బలంగా ఉంటే.. కరోనాతోపాటు జలుబు, దగ్గు, ఫ్లూ ప్రమాదాలను అధిగమించవచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే.. పలు రకాల జ్యూస్‌లతో రోగనిరోధక శక్తిని సులభంగా పెంచుకోవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే.. ఈ పానీయాలను ఇంట్లో చాలా సులభంగా తయారు చేయవచ్చు.. ఆ జ్యూస్‌లు ఏవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రోగనిరోధక శక్తిని పెంచే ఏడు రకాల జ్యూస్‌లు..

టమాటో జ్యూస్..
టమోటాలో విటమిన్ సి, ఇ, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఒక గ్లాసు టమోటా రసం తీసుకుంటే.. చర్మం, రక్త సమస్యలు తగ్గి ప్రేగులు శుభ్రపడతాయి.

నారింజ జ్యూస్..
మన శరీరం ఆరోగ్యవంతంగా పనిచేయడానికి విటమిన్ సి అవసరం. ఇది శరీర రోగనిరోధక శక్తిని అమితంగా పెంచుతుంది. దీంతోపాటు వైద్య శక్తిని పెంచి.. ఇన్ఫెక్షన్‌తో పోరాడటంలో సమర్థవంతంగా సాయపడుతుంది.
నారింజ, ద్రాక్షపండు, నిమ్మకాయ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని సురక్షితంగా ఉంచడమే కాకుండా గుండె, శరీర ఆరోగ్యానికి దోహదపడతాయి.

క్యారెట్ జ్యూస్..
దుంపలు, క్యారెట్లల్లో ఐరన్, కాల్షియంతో పాటు విటమిన్లు A, C, E పుష్కలంగా ఉంటాయి. ఈ జ్యూస్‌ ఉబ్బరం నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. ఈ జ్యూస్‌లో కొద్దిగా అల్లం, పసుపు కలిపితే దీనివల్ల జలుబు, దగ్గు లాంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.

పుచ్చకాయ జ్యూస్‌..
పుచ్చకాయలో విటమిన్లు A, C, మెగ్నీషియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. పుచ్చకాయ జ్యూస్‌.. ఇన్ఫెక్షన్లను ఎదుర్కొవడంతోపాటు.. కండరాల నొప్పులను కూడా తగ్గించేందుకు సాయపడతుంది.

కివి, స్ట్రాబెర్రీ జ్యూస్..
కివి, స్ట్రాబెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్‌ఫెక్షన్‌తో పోరాడడంలో సహాయపడతాయి.

పాలకూర
పాలకూరలో విటమిన్ ఎ, బి, సి పుష్కలంగా ఉన్నాయి. ఈ జ్యూస్‌ తాగడం వల్ల ఐరన్‌, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ జ్యూస్‌ యాంటీబాడీస్‌ ఉత్పత్తిని పెంచుతుంది.

ఆపిల్, క్యారెట్, ఆరెంజ్ మిక్స్‌డ్‌ జ్యూస్
యాపిల్, క్యారెట్ ఆరెంజ్ మిక్స్‌డ్‌ జ్యూస్ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. వాటిలో విటమిన్ ఎ, విటమిన్ బి -6, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి తక్షణ శక్తిని ఇవ్వడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.

Also Read:

Lottery: అదృష్టం తలుపుతట్టింది.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ఆటో డ్రైవర్‌.. ట్విస్ట్ ఏమిటంటే..?

Palleru Benefits: మగవారిలో లైంగిక సామర్ధ్యాన్ని పెంచే ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధం ‘పల్లేరు’.. ఎలా ఉపయోగించాలంటే