Diabetes: ఉదయం లేచిన వెంటనే శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే డయాబెటిస్‌ ముప్పు ఉన్నట్లే.. తస్మాత్‌ జాగ్రత్త..!

డయాబెటిస్‌ను కొన్ని లక్షణాలతో సులభంగా గుర్తించవచ్చని, ఉదయం లేచిన తర్వాత ఈ లక్షణాలు కన్పిస్తే వెనువెంటనే వైద్యుడిని సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేమిటంటే..

Diabetes: ఉదయం లేచిన వెంటనే శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే డయాబెటిస్‌ ముప్పు ఉన్నట్లే.. తస్మాత్‌ జాగ్రత్త..!
diabetes symptoms

Updated on: Jan 17, 2023 | 10:23 AM

మధుమేమం వ్యాధి క్రమక్రమంగా ప్రపంచాన్ని చుట్టుముట్టేస్తూ, చాపకింద నీరులా విస్తరిస్తోంది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఇప్పుడున్న కాలంలో మనం పాటిస్తున్న జీవనశైలి, అధిక ఒత్తిడి, మానసిక ఆందోళన తదితర కారణాల వల్ల మధుమేహం సమస్యతో బాధపడేవారి సంఖ్య పెరిగిపోతుంది. జీవనశైలి, ఆహారంలో మార్పులు చేసుకుని రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకుంటే సమస్యను నియంత్రించి జీవించవచ్చు. లేకపోతే శరీరంలోని అన్ని అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది షుగర్ వ్యాధి. షుగర్‌ లెవల్స్‌ గుండె జబ్బులు, మూత్ర పిండాల సమస్యలు, స్ట్రోక్‌కు దారి తీసే ప్రమాదం ఉంటుంది. శరీరంలో ఇన్సులిన్‌ను తగినంతగా ఉత్పత్తి కానప్పుడు మధుమేహం బారిన పడతారు. డయాబెటిస్‌ వచ్చిన తర్వాత అదుపులో లేకుంటే రక్తనాళాలు సైతం దెబ్బతింటాయి.

అయితే కొందరికి తెలియకుండానే రక్తంలో షుగర్స్‌ లెవల్స్‌ ఒక్కసారిగా పెరిగిపోతాయి. ముందస్తుగా సంకేతాలు కనిపిస్తున్నా పెద్దగా పట్టించుకోరు. నిర్లక్ష్యం చేస్తే మధుమేహం మరింతగా ముగిరిపోయే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఇటువంటి పరిస్థితి ఎదురవక ముందే జాగ్రత్తలు తీసుకుంటే సమస్యకు దూరంగా ఉండవచ్చుని వారు అంటున్నారు. అదే క్రమంలో డయాబెటిస్‌ను కొన్ని లక్షణాలతో సులభంగా గుర్తించవచ్చని, ఉదయం లేచిన తర్వాత ఈ లక్షణాలు కన్పిస్తే వెనువెంటనే వైద్యుడిని సంప్రదించాలని వారు సూచిస్తున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

నిద్ర లేచిన తర్వాత కనిపించే మధుమేహ లక్షణాలు:

గొంతు ఎండిపోవడం: ఒకవేళ రోజూ ఉదయం లేచిన వెంటనే దాహం వేస్తుంటే లేదా గొంతు ఎండిపోతుంటే ఇది డయాబెటిస్ లక్షణం కావచ్చు. రోజూ ఉదయం లేచిన వెంటనే నీళ్లు తాగాలన్పిస్తుంటే తక్షణం బ్లడ్ షుగర్ లెవెల్స్ పరీక్షించుకోవాలి. ఎందుకంటే గొంతు ఎండిపోవడం డయాబెటిస్ ప్రారంభ లక్షణం.

ఇవి కూడా చదవండి

అలసట: ఉదయం లేచినవెంటనే ఫ్రెష్ ఫీలింగ్ ఉండాలి. అలాకాకుండా ఉదయం లేచిన వెంటనే అలసటగా ఉంటే మాత్రం ఇది మధుమేహం లక్షణం కావచ్చు. అందుకే ఈ లక్షణం కన్పిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.

మసకగా కన్పించడం: ఉదయం లేచిన వెంటనే మీకు స్పష్టంగా కన్పించకపోతే లేదా మసకగా ఉంటే ఇది కచ్చితంగా డయాబెటిస్ లక్షణంగా మారుతుంది. దీన్ని సాధారణ లక్షణమనుకుని నిర్లక్ష్యం వహించవద్దు. ఎందుకంటే డయాబెటిస్ ఉంటే దృష్టి మసకబారుతుంది. ఒక కంటికి లేదా రెండు కళ్లకు ఇలా జరగవచ్చు.

దురద: శరీరంలో దురద రావడం కూడా డయాబెటిస్ లక్షణమే. ఒకవేళ ఉదయం లేచిన వెంటనే మీకు దురదగా ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే డయాబెటిస్ ఉంటే కాళ్లు, చేతులు లేదా చర్మంపై దురద ఉంటుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. టీవీ9 ధృవీకరించడం లేదు. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..