సంపూర్ణ పోషకాహారం చెప్పుకునే పాలు మన శరీరానికి బలన్నిస్తాయి. కాల్షియం పుష్కలంగా ఉన్నందున పాలు ఎముకలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ పాలను తీసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లల శారీరక, మానసిక అభివృద్ధిలో పాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.ఇక చాలా మంది పాలు తాగడం తోనే తమ రోజును ప్రారంభిస్తారు. కొంతమంది తమ దినచర్యలో భాగంగా పాలు తీసుకుంటారు. అయితే ఇన్ని ప్రయోజనాలున్న పాలు తాగడానికి కూడా ఒక సమయం ఉందని మీకు తెలుసా? అప్పుడే అది మీకు అందులోని ప్రయోజనాలు శరీరానికి అందుతాయయి. ఒకవేళ మీరు సరైన సమయంలో ఏదైనా తినకపోతే, దాని నుండి ప్రయోజనం పొందే బదులు ప్రతికూల ఫలితాలను పొందవచ్చు. ఆయుర్వేదం ప్రకారం ఏదైనా వాడుకోవడానికి ఒక సమయం ఉంటుంది. అలాగే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఏ సమయంలోనైనా ఖాళీ కడుపుతో పాలు తాగడం వల్ల సమస్యలు వస్తాయి. ఉదయాన్నే పరగడుపున పాలు తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్ సమస్యలు వస్తాయి. అటువంటి పరిస్థితిలో, ఇప్పటికే జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారు ఏదైనా తిన్న తర్వాత మాత్రమే పాలు తాగాలి. అయితే చిన్న పిల్లలకు అలా కాదు, రోజులో ఎప్పుడైనా పాలు తాగవచ్చు. వృద్ధులు ఉదయం పాలు తాగకూడదు.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి