Spine Health: నడుం నొప్పితో ఇబ్బందిగా ఉందా..? ఇలా చేయండి.. నొప్పి మాయం అవుతుంది..!

మీరు ప్రతిరోజూ వెన్నునొప్పి తో బాధపడుతున్నారా..? ఆ నొప్పి ని తగ్గించడానికి కొన్ని సులభమైన అలవాట్లు ఉన్నాయి. వీటిని మీ రోజు వారీ జీవితంలో చేర్చుకుంటే ఈ సమస్య నుండి బయటపడవచ్చు. సాధారణ అలవాట్లు పాటిస్తే చాలు వెన్నునొప్పి ని తగ్గించవచ్చు.

Spine Health: నడుం నొప్పితో ఇబ్బందిగా ఉందా..? ఇలా చేయండి.. నొప్పి మాయం అవుతుంది..!
Back Pain

Updated on: Jun 02, 2025 | 2:52 PM

నేటి డిజిటల్ జీవనశైలిలో ఎక్కువసేపు కూర్చోవడం, శరీరాన్ని కదపకపోవడం వెన్నునొప్పికి కారణమవుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని బాధిస్తుంది. భారతదేశంలోనే సగం మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే వెన్నునొప్పిని తగ్గించవచ్చు.

సరైన భంగిమ.. చెడ్డ భంగిమ వల్ల వెన్నునొప్పి ఎక్కువ అవుతుంది. ఎక్కువసేపు వంగి కూర్చోవడం, సరిగ్గా నడవకపోవడం వెన్నెముకపై ఒత్తిడిని పెంచుతుంది. నిటారుగా కూర్చోవడం అలవాటు చేసుకోవాలంటే టెక్నాలజీ సహాయం తీసుకోవచ్చు. కొన్ని ధరించగలిగే పరికరాలు మీ భంగిమను గుర్తు చేస్తాయి. ఇవి వెన్నెముకను నిటారుగా ఉంచడానికి సహాయపడతాయి.

బరువు నియంత్రణ.. బొడ్డు చుట్టూ అధిక బరువు ఉంటే వెన్నెముకపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే మొక్కలతో తయారైన ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. మాంసం తక్కువగా తీసుకుంటే బరువు నియంత్రణలో ఉంటుంది. అలానే శరీరంలో వాపు తగ్గుతుంది.

క్రమం తప్పని వ్యాయామం.. బలమైన వెన్నెముకకు సరైన వ్యాయామం అవసరం. రోజూ కనీసం 10 నిమిషాలు వ్యాయామం చేయడం ద్వారా వెన్నెముక బలపడుతుంది. జిమ్‌ కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే యూట్యూబ్ లేదా ఆన్‌లైన్ దినచర్యలతో వ్యాయామం చేయొచ్చు. ఇది సులభంగా సాధ్యమవుతుంది.

వస్తువులను సరిగ్గా ఎత్తడం.. వస్తువులు కదిలించేటప్పుడు తప్పుగా ఎత్తితే వెన్నుకి గాయం కావచ్చు. ఇప్పుడు మార్కెట్‌ లో స్మార్ట్ లిఫ్టింగ్ అసిస్టెంట్‌ లు అందుబాటులో ఉన్నాయి. ఇవి మీరు ఎత్తే వస్తువు బరువును గుర్తించి.. ఎలా సురక్షితంగా ఎత్తాలో సూచిస్తాయి. ఇలా చేస్తే అనవసరమైన ఒత్తిడి తగ్గుతుంది.

ప్రతి అరగంటకు లేదా గంటకు చిన్న విరామం తీసుకుని సాగదీసే వ్యాయామాలు చేయాలి. ఫోన్‌ లో అలారాలు పెట్టుకోవచ్చు. ఒక్క రెండు నిమిషాలు శరీరాన్ని సాగదీయడం వల్ల కండరాల్లోని ఉద్రిక్తత తగ్గుతుంది. శరీర కదలిక సౌలభ్యం మెరుగవుతుంది. దీని వల్ల వెన్నునొప్పి కూడా తగ్గుతుంది. ఈ సాధారణ అలవాట్లు పాటిస్తే వెన్నునొప్పిని తగ్గించవచ్చు.