
ఇతర ఆరోగ్య సమస్యలతో పోలిస్తే రక్తహీనత (Anemia) ఎక్కువ మందిలో కనిపించే ఒక మామూలు సమస్య. ఇది ముఖ్యంగా స్త్రీలు, చిన్నపిల్లలు, టీనేజ్ లో ఉన్నవారికి ఎక్కువగా వస్తుంది. సరైన ఆహారం తీసుకోకపోతే.. ఇది శరీరంపై చాలా కాలం ప్రభావం చూపుతుంది. మన రక్తంలో ఎర్ర రక్త కణాలు (RBCs) తక్కువగా ఉన్నప్పుడు లేదా హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు.. శరీరానికి అవసరమైన ఆక్సిజన్ అందదు. దీని వల్ల అలసట, ఒత్తిడి, మూర్ఛ లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
టీ కాఫీ తక్కువగా తీసుకోండి.. టీ, కాఫీలో ఉండే టానిన్లు ఐరన్ శరీరం తీసుకోవడాన్ని ఆపేస్తాయి. భోజనం చేసేటప్పుడు లేదా తర్వాత వెంటనే టీ తాగడం మంచిది కాదు. కనీసం 1 గంట గ్యాప్ ఇవ్వడం ఉత్తమం.
ఆరోగ్యకరమైన కొవ్వులు.. విటమిన్ A, E లాంటి కొవ్వులో కరిగే విటమిన్లు హిమోగ్లోబిన్ స్థాయిని సరిగ్గా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటిని శరీరం గ్రహించడానికి కొవ్వు అవసరం.
నీరు బాగా తాగడం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రోజుకి కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి. అలాగే తృణధాన్యాలు కూడా రక్తహీనత రాకుండా బలం ఇస్తాయి.
రక్తహీనత సరైన ఆహారం ద్వారా దాదాపుగా నివారించగల ఆరోగ్య సమస్య. పోషకాలు సమతుల్యంగా ఉండే ఆహారం, నీరు, సరైన జీవనశైలి ద్వారా మనం ఈ సమస్యను తగ్గించవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)