
నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, విటమిన్ బి12 వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని పొడిబారకుండా కాపాడతాయి. శక్తిని అందిస్తాయి. ఎముకలను బలపరుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి.
చాలా మంది నెయ్యిని వేరే పదార్థాలతో కలిపి తీసుకునేటప్పుడు కొన్ని తప్పులు చేస్తారు. దానివల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ముఖ్యంగా ఈ క్రింది విషయాలలో జాగ్రత్త వహించాలి.
చాలా మంది చల్లటి రోటీకి నెయ్యి పూసుకొని తింటారు. ఇది మంచిది కాదు. వేడి రోటీతో నెయ్యి తింటేనే దానిలోని పోషకాలు అందుతాయి. చల్లటి రోటీతో నెయ్యి తింటే కొవ్వు పెరుగుతుంది.
వేడి కూరగాయలతో నెయ్యి కలిపి తినడం మంచిది. కానీ చల్లటి నెయ్యితో కూరగాయలు తింటే నెయ్యి గొంతులో, ప్రేగుల్లో పేరుకుపోయి మలబద్ధకం, కఫం వంటి సమస్యలు వస్తాయి.
పూరీలను నెయ్యితో వేయించకూడదు. అలాగే బాగా వేయించిన ఆహారాన్ని నెయ్యిలో వండకూడదు. ఇలాంటివి తింటే శరీరంలో కొలెస్ట్రాల్ వేగంగా పెరుగుతుంది. గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
నెయ్యి తిన్న వెంటనే చల్లటి నీరు తాగకూడదు. ఇది ఆరోగ్యానికి హాని చేస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ వేగంగా పెరుగుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)