యువతలో పెరుగుతున్న అపెండిక్స్ క్యాన్సర్.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?

ఇంతకు ముందు పెద్దవాళ్లలో ఎక్కువగా కనిపించే అపెండిక్స్ క్యాన్సర్ ఇప్పుడు యువతలోనూ బాగా పెరుగుతోంది. ఇది శరీరంలో చిన్న చోట మొదలైనా.. పెద్ద సమస్యగా మారగలదు. మన జీవనశైలి, ఆహారపు అలవాట్లే దీనికి ముఖ్య కారణాలు అంటున్నారు నిపుణులు. ఈ జబ్బు లక్షణాలు తెలుసుకుని.. ముందే జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

యువతలో పెరుగుతున్న అపెండిక్స్ క్యాన్సర్.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..?
Apendix Cancer

Updated on: Jul 20, 2025 | 8:24 PM

పెద్దపేగుకు అతుక్కొని ఉండే చిన్న అవయవం అపెండిక్స్. దీనికి వచ్చే క్యాన్సర్ సాధారణంగా ఇంతకుముందు పెద్దవారిలో కనిపించేది. కానీ ఇప్పుడు యువతలోనూ పెరుగుతోందని రీసెర్చ్‌లు చెబుతున్నాయి. ముఖ్యంగా మిల్లీనియల్స్‌లో కూడా ఈ క్యాన్సర్ కేసులు గణనీయంగా నమోదవుతున్నాయి. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. లైఫ్‌స్టైల్ మార్పులు, బరువు పెరగడం, తప్పుడు ఆహారపు అలవాట్లు, పేగుల్లో ఉండే మైక్రోబయోమ్ బ్యాలెన్స్ తప్పడం, పదే పదే సీటీ స్కాన్‌లు చేయించుకోవడం వంటివి ఈ క్యాన్సర్ పెరగడానికి కారణాలుగా నిపుణులు భావిస్తున్నారు.

అపెండిక్స్ క్యాన్సర్ కు కారణాలు ఏంటి..?

  • వారసత్వంగా వచ్చేవి: లించ్ సిండ్రోమ్ (Lynch Syndrome), ఫ్యామిలియల్ అడెనోమాటస్ పాలిపోసిస్ (Familial Adenomatous Polyposis) వంటి జబ్బులు కూడా అపెండిక్స్ క్యాన్సర్‌ కు కారణం కావచ్చు.
  • జీర్ణ సమస్యలు.. క్రోన్స్ డిసీజ్ (Crohns disease) లాంటి ఎక్కువ కాలం ఉండే కడుపు జబ్బులు.. అలాగే చికిత్స చేయని పేగు ఇన్ఫెక్షన్లు కూడా అపెండిక్స్ లోపల కణాలను మార్చేయవచ్చు.
  • చెడు అలవాట్లు.. పొగతాగడం, ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం తినడం, పీచుపదార్థాలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వంటి అలవాట్లు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. కడుపులో యాసిడ్‌ ను తగ్గించే మందులను ఎప్పుడూ వాడుతూ ఉండటం, ఇంట్లో ఎవరికైనా గతంలో కడుపు, పేగు క్యాన్సర్‌ లు ఉన్నా ఈ జబ్బు రావడానికి కారణం కావచ్చు.

ఎలాంటి లక్షణాలు ఉంటాయి..?

  • కడుపులో కుడివైపు కింది భాగంలో నిరంతరం నొప్పి ఉండటం.
  • కారణం లేకుండా బరువు తగ్గడం.
  • ఎప్పుడూ వికారం, కడుపు ఉబ్బరంగా అనిపించడం.
  • కింది భాగంలో బరువుగా అనిపించడం.
  • కడుపు కింది భాగంలో ముద్దలాగా లేదా గట్టిగా అనిపించడం.

ఇలా రాకుండా ఏం చేయాలి..?

  • బరువును కంట్రోల్‌ లో ఉంచుకోవడం.
  • తాజా పండ్లు, కూరగాయలు, పూర్తి ధాన్యాలు ఎక్కువగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం.
  • అధిక షుగర్, ప్రిజర్వేటివ్‌లు కలిపిన ఫుడ్‌ కి దూరంగా ఉండడం.
  • రోజూ వ్యాయామం చేయడం.
  • పొగతాగడం, మద్యం పూర్తిగా మానేయడం.

క్రోన్స్ డిసీజ్, గాస్ట్రిటిస్ వంటి వ్యాధులను మొదట్లోనే గుర్తించి చికిత్స చేయించుకోండి. దీని వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. కుటుంబంలో జీర్ణవ్యవస్థ క్యాన్సర్‌ ల చరిత్ర ఉంటే.. జన్యు పరీక్షలు, ప్రాథమిక స్క్రీనింగ్‌ లు చేయించుకోవడం మంచిది. ఇది వ్యాధిని ముందుగానే గుర్తించి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)