జంక్ ఫుడ్ ఎక్కువగా తింటే గుండె సంబంధిత వ్యాధులు వస్తాయా ? అధ్యయనాల్లో బయటపడ్డ విషయాలెంటీ ?

|

Feb 12, 2021 | 1:35 PM

ప్రస్తుత హడావిడి పరిస్థితులలో చాలా మంది జంక్ ఫుడ్ తినడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే తాజాగా జంక్ ఫుడ్ తినేవారిలో గుండె

జంక్ ఫుడ్ ఎక్కువగా తింటే గుండె సంబంధిత వ్యాధులు వస్తాయా ? అధ్యయనాల్లో బయటపడ్డ విషయాలెంటీ ?
Follow us on

ప్రస్తుత హడావిడి పరిస్థితులలో చాలా మంది జంక్ ఫుడ్ తినడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే తాజాగా జంక్ ఫుడ్ తినేవారిలో గుండె సంబంధిత వ్యాధులు అధికంగా వస్తాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. బాగా వేయించిన ఆహారంలోని చిన్న చిన్న పదార్థాలు గుండెకు అలాగే రక్తాన్ని ప్రసరణ చేసే ధమనులకు హాని కలిగిస్తాయని తెలిసింది. హార్ట్ జర్నల్‏లో ఇందుకు సంబంధించిన వివరాలు ప్రచురితమయ్యాయి. ప్రతిరోజు ఎక్కువగా వేయించిన ఆహారాన్ని తినేవారిలో 28 శాతం మంది గుండె రక్తప్రసారణలో ప్రమాదం కలగనుందని పేర్కోంది. 9.5 సంవత్సరాల నుంచి వేయించిన ఆహారాన్ని ఎక్కువగా తినేవారికి గుండె సంబంధ వ్యాధులు అలాగే ప్రమాదకరమైన వ్యాధులకు గల కారణాలను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు అధ్యయనం చేపట్టారు.

ఈ అధ్యయనాల్లో చాలా విషయాలు బయటపడ్డాయి. అవేంటంటే.. బాగా వేయించిన ఆహారాన్ని తినడం వలన గుండె సంబంధ వ్యాధులు ఇంకా అధికమవుతాయని.. అందుకు సంబంధించిన కారణాలు మాత్రం ఇప్పటికి వరకు తెలియదని కొన్ని నివేధికలు చెబుతున్నాయి. వేయించిన ఆహారాన్ని తినడం వలన కొరోనరీ గుండె జబ్బులు 22 శాతం, గుండె ఆగిపోవడం వంటివి 37 శాతం జరుగుతుందని తెలిపారు. వారానికి 114 గ్రాముల వేయించిన ఆహారాన్ని ప్రతిసారి తినడం వలన 3 శాతం కొరోనరీ గుండె జబ్బులు, 12 శాతం గుండె ఆగిపోవడం వంటి సమస్యలు వస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వేయించిన ఆహారాన్ని ఎక్కువగా తినడం వలన గుండె సమస్యలు అధికమవడానికి గల కారణాలను ఇంకా విశ్లేషించాలని శాస్త్రవేత్తలు తెలిపారు.

బరువు తగ్గడం, ఫిట్ నెస్, సన్నగా, ఆరోగ్యంగా మరియు చురుకుగా ఉండాలంటే అధికంగా వేయించిన ఆహారాన్ని తినకూడదు. అలాగే మంచి ఆరోగ్యం, బలమైన రోగనిరోధక శక్తిని పొందడానికి రోజూ చాలా పండ్లు మరియు కూరగాయలను తినాలి. వీటితోపాటు కొవ్వులు, పిండి పదార్థాలు, ప్రోటీన్, ఫైబర్, ప్రోబయోటిక్స్ ఉన్న భోజనాన్ని తినడం మంచిది. రోజూ ఇలాంటి ఆహారాన్ని తినడం ద్వారా చురుకుగా, ఆరోగ్యంగా ఉంటారు.

Also Read:

రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ టీ ఎంతో మేలంట.. సలహాలిస్తున్న బాలీవుడ్ హీరోయిన్.