
మహిళలకు పీరియడ్స్ సమయంలో అనేక అసౌకర్యాలు ఎదురవుతాయి. వాటిలో కడుపు ఉబ్బరం ఒక పెద్ద సమస్య. ఈ సమస్యకు సహజంగా ఉపశమనం కలిగించే ఒక సులభమైన ఇంటి చిట్కా ఉంది. దీని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
పోషకాహార నిపుణుల సలహా ప్రకారం.. పీరియడ్స్ రాకముందు నీరసంగా, బరువుగా, ఉబ్బినట్లు అనిపించడం అనేది హార్మోన్ల ప్రభావం వల్లే జరుగుతుంది. ఇలాంటి సమయంలో మీకు ఉపశమనం కలిగించే ఒక ప్రత్యేకమైన డ్రింక్ ఉంది. ఆ డ్రింక్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
పరిశోధనల ప్రకారం.. నెలసరి సమయంలో కడుపు నొప్పిని కలిగించే గర్భాశయ కండరాల సంకోచాలను అల్లం అదుపు చేస్తుందని తెలుస్తోంది. అల్లంలో సహజంగా ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వాపును తగ్గించి నొప్పిని కూడా తగ్గిస్తాయి.
అల్లంతో పాటు సోంపు కూడా నొప్పిని తగ్గించడంలో బాగా పని చేస్తుంది. సోంపులో ఉండే యాంటీస్పాస్మోడిక్ (Antispasmodic) గుణాలు గర్భాశయ కదలికలను అదుపు చేసి ఉపశమనాన్ని ఇస్తాయి. ఇది కడుపు ఉబ్బరం తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది.
ఈ డ్రింక్ తయారు చేయడానికి మీకు 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ తాజా అల్లం తురుము, 2 కప్పుల నీరు అవసరం ఉంటుంది.
ఒక పాత్రలో రెండు కప్పుల నీటిని తీసుకుని.. అందులో సోంపు, తురిమిన అల్లం వేసి బాగా మరిగించండి. నీరు సగానికి తగ్గిన తర్వాత ఆ మిశ్రమాన్ని వడకట్టి.. కాస్త చల్లారిన తర్వాత తాగాలి. దీన్ని నెలసరి సమయంలో ఉదయం లేదా రాత్రి తీసుకోవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)