
ప్రస్తుత కాలంలో ఆహార అలవాట్లు మారాయి.. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలామంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్నారుల ఆరోగ్యంపై దృష్టిసారించడం మంచిది. అయితే, బాల్యంలో, కౌమారదశలో అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్) స్ట్రోక్, గుండెపోటు వంటి తీవ్రమైన ప్రమాదాలను నాలుగు రెట్లు పెంచుతుందని ఇటీవలి పరిశోధన వెల్లడించింది. కెనడాలోని అంటారియోలో 1996 – 2021 మధ్య అధిక రక్తపోటు సమస్య ఉన్న 25,605 మంది పిల్లలు, కౌమారదశలో ఉన్న పిల్లలతో ఈ పరిశోధన నిర్వహించారు.
అధిక రక్తపోటు ఉన్న పిల్లలు, యుక్తవయస్కులు ఈ సమస్య లేని వారితో పోలిస్తే పెద్దయ్యాక గుండెపోటు, పక్షవాతం లేదా గుండె శస్త్రచికిత్సకు గురయ్యే ప్రమాదం రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధన అధిక రక్తపోటును నియంత్రించడం, చిన్న వయస్సులోనే దాని ప్రమాదాలను తగ్గించడం ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం..
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం
ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం..
ఒత్తిడిని తగ్గించడం..
అవసరమైతే వైద్యులను సంప్రదించి మందులు తీసుకోవడం..
అధిక రక్తపోటు అనేది అన్ని వయసుల ప్రజలను ప్రభావితం చేసే తీవ్రమైన ఆరోగ్య సమస్య. పెద్దవారిలో గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి.. పిల్లలు , టీనేజ్‌లలో అధిక రక్తపోటును నియంత్రించడం చాలా ముఖ్యం అని పరిశోధకులు తెలిపారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..