Oral Cancer: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవాళిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. ఇంకా క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య రోజురోజూకీ గణనీయంగా పెరిగిపోతుంది. పిల్లల నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు. మన జీవనశైలి, ఆహారపు అలవాట్లలోని మార్పులే దీనికి ప్రధాన కారణమని వైద్య, ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలోనే సిగరెట్లు కాల్చడం, సిగార్లు పీల్చడం, పొగాకు నమలడం, గుట్కా, పాన్ మసాలా వంటివి తినడం వల్ల నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అభివృద్ది చెందుతున్న దేశాల్లో పొగాకు, మధ్యపానమే మౌత్ క్యాన్సర్‌కు ముఖ్య కారణాలు. భారతదేశంలో 80 శాతానికి పైగా కేసులు వీటి వల్లే వస్తున్నాయి. ప్రస్తుత రోజుల్లో చిన్న వయసులోనే సిగరెట్లు, మందు తాగడం వంటివి చేస్తున్నారు. ఇదే ట్రెండ్ ఇలాగే కొనసాగితే నోటిక్యాన్సర్ కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. అసలు నోటి క్యాన్సర్‌ను ఎలా గుర్తించాలి.. దాని లక్షణాలేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
నోటి క్యాన్సర్ లక్షణాలు
ఈ లక్షణాలు మీలో కనిపిస్తే వెనువెంటనే వైద్యుడిని సంప్రదించండి. లేకపోతే సమస్య తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది.
నోటి క్యాన్సర్ చికిత్స
నోటి క్యాన్సర్ అనేది క్యాన్సర్ రకాలలో ఒక రకం.ఈ సమస్య స్టేజ్‌ను బట్టి ట్రీట్‌మెంట్ ఇస్తారు వైద్యులు. సాధారణంగా క్యాన్సర్ చికిత్సలో సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ వంటివి చేస్తారు. మౌత్ క్యాన్సర్ చికిత్స చాలా బాధాకరమైనది, ఇంకా ఖర్చుతో కూడికున్నది. అందువల్ల క్యాన్సర్ కారకాల నుంచి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.