AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tomato: ఈ ఆరోగ్య సమస్యలున్నవారు టమోటా తినకూడదు.. చాలా ప్రమాదకరం.!

ఆహార రుచిని పెంచే టమోటా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిని చాలా రకాలుగా వినియోగిస్తారు. ప్రధానంగా కర్రీలు, సలాడ్లు, చట్నీలలో..

Tomato: ఈ ఆరోగ్య సమస్యలున్నవారు టమోటా తినకూడదు.. చాలా ప్రమాదకరం.!
Tomatoes
Ravi Kiran
|

Updated on: Feb 09, 2023 | 1:57 PM

Share

ఆహార రుచిని పెంచే టమోటా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిని చాలా రకాలుగా వినియోగిస్తారు. ప్రధానంగా కర్రీలు, సలాడ్లు, చట్నీలలో ఎక్కువగా వాడుతుంటారు. ఇందులో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. అంతేకాదు విటమిన్ సి కూడా మన శరీరానికి లభిస్తుంది. ఈ కారణంగా ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అంతే కాదు లైకోపీన్, పొటాషియం వంటి పోషకాలు కూడా టమాటోలో పుష్కలంగా లభిస్తాయి. ఇది శరీరానికి ప్రయోజనకరంగా ఉండటం వల్ల నిపుణులు దీనిని సలాడ్ రూపంలో రోజుకు ఒకసారైనా తినాలని సూచిస్తారు. అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు టమోటాలు తీసుకుంటే వ్యాధి తీవ్రత ఇంకా పెరుగుతుంది. మరి వారెవరో తెలుసుకుందామా.?

కిడ్నీ, పిత్తాశయంలో రాళ్లు

కిడ్నీ, పిత్తాశయంలో రాళ్ల సమస్య ఉన్నవారు టమోటాలను తక్కువ మోతాదులో తీసుకోవాలి. టమోటా గింజలు రాళ్ల సమస్యను మరింతగా పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

కీళ్ళ నొప్పులు

కీళ్లనొప్పులు వంటి తీవ్రమైన సమస్యలు ఉన్నవారు టమోటాలు తినకుండా ఉండాలి. ఇందులో ఉండే పులుపు శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని మరింత పెంచుతుందని నిపుణులు భావిస్తున్నారు. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు వైద్యుల సలహా మేరకే టమోటాలు తినడం మంచిది.

అతిసారం

టమోటాను హైడ్రేటింగ్ వెజిటేబుల్ అని పిలిచినప్పటికీ.. అతిసారం సమస్యతో బాధపడుతున్నవారు దీనికి దూరంగా ఉండాలి. టమోటాల్లో ఉండే సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా డయేరియా సమస్యను మరింత పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే.

Follow Us
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..