Heart Attack Symptoms: ఉరుకు పరుగుల జీవితంలో మనందరినీ ఎన్నో వ్యాధులు చుట్టుముడుతుంటాయి. లోతైన లక్షణాలు కనిపించే వరకు మనకు ఏ వ్యాధి వచ్చిందో అప్పటివరకు గుర్తుపట్టం. ఏదైనా వ్యాధితో పోరాడటానికి సులభమైన అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయితే.. రోగాలతో తేలికగా పోరాడలేని వారు, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు కొందరు ఉంటారు. ముఖ్యంగా అలాంటివారు పలు రోగాలపై స్పృహతో ఉండాలంటున్నారు నిపుణులు. మనందరి శరీరానికి గుండె చాలా ముఖ్యమైనది. జీవించి ఉండాలంటే.. గుండె సరిగ్గా కొట్టుకోవడం చాలా ముఖ్యం. అయితే గుండెపోటుకు ముందు మీ శరీరం మీకు నిరంతరం సంకేతాలు ఇస్తుందని మీకు తెలుసా? మీరు దీన్ని అర్థం చేసుకోకపోయినా.. విస్మరించినా.. మీరు రిస్క్‌లో పడినట్లేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండె సరిగా పనిచేయడం ఆగిపోతే పలు సంకేతాలు తరచుగా వస్తాయని పేర్కొంటున్నారు. నిపుణుల నివేదికల ప్రకారం.. గుండెపోటుకు ముందే మన శరీరం అనేక సంకేతాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. మనం ఎల్లప్పుడూ ఈ సంకేతాలపై శ్రద్ధ వహించాలి. వాటిని ఏ పరిస్థితిలోనైనా విస్మరించకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఛాతీపై ఒత్తిడి..
గుండెపోటు సంకేతాల్లో ఛాతీపై ఒత్తిడి పురుగుతుంది. ఆంజినా అని కూడా పిలుస్తారు. ఈ సమయంలో మీకు సరిగా ఊపిరాడదు.. నాడీ కూడా కొట్టుకున్నట్లు అనిపించదు. మీ గుండెకు తగినంత ఆక్సిజన్ ఉన్న రక్తం లభించనప్పుడు ఛాతీ నొప్పి తరచుగా సంభవిస్తుంది. తరచుగా ప్రజలు ఈ ఒత్తిడిని విస్మరిస్తారు. అయితే ఈ ఒత్తిడి స్థిరంగా ఉంటే గుండెపోటు రావచ్చు.
చల్లని చెమట పట్టడం..
మీకు అకస్మాత్తుగా తల తిరగడం లేదా మీకు చల్లగా చెమటలు పట్టడం వంటివి ఉంటే వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించండి. చాలా సార్లు, మంచి ఆహారం తీసుకున్న తర్వాత కూడా, మనకు నిరంతరం బలహీనంగా అనిపిస్తుంది. ఇది కూడా గుండె సమస్యల లక్షణమని నిపుణులు సూచిస్తున్నారు.
శ్వాస సమస్య..
గుండె కాకుండా, రక్త ప్రసరణ సరిగా జరగకపోతే.. ఎక్కువగా ప్రభావితమయ్యే రెండవ అవయవం ఊపిరితిత్తులు. ఊపిరితిత్తులలో రక్తం సరఫరా లేకపోవడం వల్ల మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలవుతుంది. సరిగ్గా ఊపిరి తీసుకోలేకపోతే మీ మెదడుకు ఆక్సిజన్ తక్కువగా చేరుతుంది.
అలసట, నిద్రలేమి
మంచి డైట్ వర్కవుట్ చేసిన తర్వాత కూడా మీరు ఎటువంటి కారణం లేకుండా చాలా అలసిపోయినట్లు అనిపిస్తే మీ గుండెకు రక్త ప్రసరణ తగ్గిపోవచ్చు. ధమనులలో ఫలకం ఏర్పడటం వల్ల కూడా ఇది జరుగుతుంది. ఇదే కాకుండా, గుండెపోటు అతి ముఖ్యమైన లక్షణం నిద్ర లేకపోవడం. నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో అనేక రకాల వ్యాధులు పుట్టుకొస్తాయి. ఇలాంటి పరిస్థితిలో మీకు నిద్రలేమి ఎక్కువగా ఉంటే.. వైద్యుడిని సంప్రదించడం మేలు.
Also Read: