సాయంత్రం టీతో పాటు తినడానికి లైట్ గా, టేస్టీగా ఉండే హెల్తీ స్నాక్స్ ఇవే..!

సాయంత్రం వేళ చాలా మందికి టీ తాగడం అలవాటై ఉంటుంది. అలాంటి సమయంలో పొట్టలో కాస్త ఖాళీగా అనిపించడంతోపాటు కాస్త తినాలనిపించడమూ సహజమే. కానీ అలాంటి సందర్భాల్లో ఎటువంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందో మనం తెలుసుకోవాలి. టీతో పాటు ఆరోగ్యానికి హానికరం కానివి.. శక్తినిచ్చే తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై మంచి ప్రభావం పడుతుంది.

సాయంత్రం టీతో పాటు తినడానికి లైట్ గా, టేస్టీగా ఉండే హెల్తీ స్నాక్స్ ఇవే..!
Evening Tea Snacks

Updated on: May 14, 2025 | 12:32 PM

బాదం, వాల్‌ నట్, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ లలో మంచి కొవ్వులు, ఫైబర్, విటమిన్‌ లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీర బరువుని సమతుల్యంగా ఉంచడంలో సహాయకరంగా ఉంటాయి. రోజూ కొద్దిగా డ్రై ఫ్రూట్స్ టీతో తీసుకుంటే శక్తి లభిస్తుంది. ఇవి హృదయ ఆరోగ్యానికి తోడ్పడతాయి.

పోహా.. అతి తక్కువ సమయంలో తయారయ్యే ఈ వంటకం టీతో తీసుకోవడం చాలా మంచి ఆప్షన్. పోహాలో ఐరన్, ఫైబర్, కొలెస్ట్రాల్ నియంత్రణకు అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇది జీర్ణక్రియ మెరుగుపరచడంలో, గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో ఉపయోగకరంగా ఉంటుంది.

బేసన్ చీలా.. బంగాళదుంపలు లేకుండా నెయ్యితో వేయించిన బేసన్ చీలా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా రుచికరంగా ఉంటుంది. తక్కువ కేలరీలు కలిగిన ఈ వంటకం కడుపునిండిన ఫీల్ ఇస్తుంది. దీనిలో ఉండే ప్రోటీన్ శరీరానికి శక్తిని ఇస్తుంది. రోజూ టీ సమయంలో దీన్ని ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది.

బ్రెడ్ బటర్ లో ఉండే కాల్షియం ఎముకలకు బలం ఇస్తుంది. అయితే దీనిని అధికంగా తీసుకుంటే శరీర బరువులో మార్పులు రావచ్చు కాబట్టి తగినంతగా తీసుకోవాలి.

రస్క్.. గోధుమ పిండి ఉపయోగించి తయారైన రస్క్ ఆరోగ్యపరంగా మేలు చేసే ఆప్షన్. ఇది చక్కెర శోషణను నెమ్మదిగా చేస్తూ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నిలబెట్టడంలో సహాయపడుతుంది. సెలీనియం, మాంగనీస్ వంటి ఖనిజాలు ఇందులో లభిస్తాయి. టీతో తినేందుకు ఇది మంచి ఎంపిక.

బ్రెడ్ పకోడా.. చిన్నగా ఆకలేసినప్పుడు టీకి చక్కటి జోడిగా బ్రెడ్ పకోడా పని చేస్తుంది. తక్కువ నూనెతో తయారు చేస్తే దీని వలన అధికంగా ఫ్యాట్ చేరదు. అందులో ఉండే కార్బోహైడ్రేట్లు తక్షణ శక్తిని ఇస్తాయి. పిల్లలు ఈ స్నాక్‌ ను ఇష్టపడతారు.

టమాటో సాండ్విచ్.. టమాటాలతో తయారైన ఈ సాండ్విచ్ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. టమాటాల్లో ఉండే లైకోపీన్ క్యాన్సర్ నివారణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రక్తపోటు, షుగర్‌ను సమతుల్యంలో ఉంచడంలో సహాయపడుతుంది. సులభంగా చేసుకుని వెంటనే తినదగ్గ స్నాక్ ఇది.

సజ్జ పిండితో తయారైన బజ్రా మాత్రిలో అధిక పోషకాలు ఉంటాయి. ఇది జీర్ణశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉండటంతో గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో దోహదపడుతుంది. తక్కువ నూనెతో వేయించి తీసుకుంటే.. ఇది మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది.

సాధారణంగా సాయంత్రపు టీ సమయానికి తినే తినుబండారాలు శరీరానికి శక్తిని ఇచ్చేలా ఉండాలి. పై పేర్కొన్న వంటకాలు తక్కువ కేలరీలు అధిక పోషక విలువలతో ఉండి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సహాయపడతాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)