Herbal Tea Side Effects: పాలతో చేసిన టీ ఆరోగ్యానికి హానీకరం అని అంటుంటారు. అందుకే చాలా మంది హెర్బల్ టీ వైపు మొగ్గు చూపుతారు. హెర్బల్ టీ తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు. అదే సమయంలో హెర్బల్ టీ అధికంగా తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి ప్రమాదమేనని వార్నింగ్ కూడా ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు. హెర్బల్ టీ ని అధికంగా తాగితే కడుపు నొప్పి, జీర్ణ క్రియ మందగించడం సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఈ హెర్బల్ టీ తాగడం వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
హెర్బల్ టీ సైడ్ ఎఫెక్ట్స్..
జీర్ణక్రియపై ప్రభావం..
హెర్బల్ టీ అధికంగా తాగడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ముఖ్యంగా పూదీనా టీ ఇబ్బంది పెడుతుంతి. పుదీనాలో ఉండే మెంథాల్ ఉదర సమస్యలను పెంచుతుంది. అందుకే హెర్బల్ టీ ని పరిమితంగా తాగాలి.
గర్భధారణ సమయంలో హాని జరుగొచ్చు..
గర్భిణీ స్త్రీలు హెర్బల్ టీని ఎక్కువగా తీసుకోకూడదు. గర్భధారణ సమయంలో హెర్బల్ టీని అధికంగా తాగితే.. రక్రస్త్రావం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. నిపుణుల సలహా మేరకు మాత్రమే హెర్బల్ టీ తాగాలి.
మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం..
కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే హెర్బల్ టీ తాగడం మనుకోండి. హెర్బల్ టీ ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. నిపుణుల సలహా మేరకే వాటిని తీసుకోవాలి.
గుండెల్లో మంట..
హెర్బల్ టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట వస్తుంది. హెర్బల్ టీలో చాలా మసాలా దినుసులు ఉపయోగిస్తారు. దీని కారణంగా గుండెల్లో మంట వస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..