
ఆహారంలో మార్పులు, సమయాభావం కారణంగా.. తరచుగా హోటళ్లలో లేదా కార్యాలయాల్లో ఆహారం తినే వారిని మనం రోజూ చూస్తే ఉన్నాం. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఆహారం తినేటప్పుడు కొందరికి ఒక అలవాటు ఉంటుంది. మరికొందరు తప్పనిసరి పరిస్థితిలో అలా తినాల్సి వస్తుంది. మరి ఇంతకీ ఏంటా అలవాటు? ఎలా తింటారు? ఒకవేళ అలా తింటే ఏం జరుగుతుంది? అనేగా మీరు ఆలోచిస్తుంది. ఆ సంగతే ఇవాళ మేం మీకు చెప్పబోతున్నాం. ఈ వార్త చదివిన తరువాత మీ ఆ అలవాటును తప్పకుండా మానేస్తారు. లేదంటే.. ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చిరస్తున్నారు. ఇక మ్యాటర్‌లోకి వెళ్దాం..
వాస్తవానికి చాలా మంది నిలబడి ఆహారం తింటుంటారు. పెళ్లిళ్లలోనో, ఏదైనా ఫంక్షన్‌లోనే ఎప్పుడో ఒకసారి అంటే పర్వాలేదు కానీ, అదే పనిగా తరచుగా నిలబడి ఆహారం తినేవారు కొందరు ఉంటారు. కానీ, ఆ అలవాటే వారి ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. న్యూట్రిషనిస్టుల ప్రకారం.. నిలబడి తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలా చేయడం వల్ల ఊబకాయం బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు. నిలబడి తినడం వలన కలిగే సమస్యలేంటో తెలుసుకుందాం.
1. నిలబడి ఆహారం తినడం వలన తన ఆకలిపై సరైన అవగాహన ఉండదు. ఫలితంగా ఎక్కువ గానీ, తక్కువ గానీ ఆహారం తీసుకునే అవకాశం ఉంది. చాలా వరకు నిలబడి తినే వ్యక్తులు ఎక్కువ ఆహారం తీసుకుంటారు. ఫలితంగా కడుపు నిండి, అసౌకర్యానికి గురవుతారు. మొత్తం శరీర నిర్మాణంలో మార్పులకు కూడా కారణం అవుతుంది.
2. మనం నిలబడి ఆహారం తింటున్న సమయంలో పేగులు కుంచించుకుపోతాయి. ఫలితంగా ఆహారం జీర్ణం కాదు. మన జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అజీర్తి, మలబద్దకం, ఆమ్లత్వం వంటి సమస్యలు ఉన్నాయి. కొన్నిసార్లు చంచల స్వభావం కలుగుతుంది.
3. నిలబడి ఆహారం తీసుకోవడం వల్ల కాళ్లు, తుంటిపై చెడు ప్రభావం చూపుతుంది. నొప్పి వస్తుంది. వ్యక్తి నిలబడి భోజనం చేస్తున్నప్పుడు, వారి మనస్సు విశ్రాంతి తీసుకోదు. చికాకు మొదలవుతుంది.
4. నిలబడి ఆహారం తీసుకోవడం వలన గొంతు నుంచి కడుపులోకి నేరుగా ఆహారం పడిపోతుంది. ఫలితంగా అన్నవాహికపై దుష్ప్రభావం పడుతుంది. అల్సర్ వంటి సమస్యలు కూడా వస్తాయి.
5. నిలబడి ఆహారం తినడం వల్ల ఆహారం నేరుగా జీర్ణాశయంలోకి వెళ్లిపోతుంది. ఇది కొన్నిసార్లు కడుపు నొప్పి, ఉబ్బరానికి దారి తీస్తుంది. ఇక నిలబడి ఆహారం తినడం వలన అజీర్తి సమస్య కూడా తలెత్తుతుంది. శరీరంలో కొవ్వు పెరుగుతంది. స్థూలకాయం సమస్యకు దారి తీస్తుంది.
గమనిక: పైన పేర్కొన్న సమాచారం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యులకు చూపించుకోవాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..