Ayurveda Tips: ఈ ఇబ్బందులు కనిపిస్తున్నాయా.. కాలిష్యం లోపం ఉన్నట్లే.. ఈ 4 ఆహారపదార్ధాలతో కాల్షిమాన్ని పెంచుకోండి

|

Apr 13, 2022 | 4:28 PM

Ayurveda Health Tips:ఎముక, దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికే కాదు, రక్తం గడ్డకట్టడం, గుండె లయను నియంత్రించడం, ఆరోగ్యకరమైన నరాల పనితీరు వంటి ఇతర శరీర విధుల్లో కాల్షియం..

Ayurveda Tips: ఈ ఇబ్బందులు కనిపిస్తున్నాయా.. కాలిష్యం లోపం ఉన్నట్లే.. ఈ 4 ఆహారపదార్ధాలతో కాల్షిమాన్ని పెంచుకోండి
Boost Calcium Levels Natura
Follow us on

Ayurveda Health Tips:ఎముక, దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికే కాదు, రక్తం గడ్డకట్టడం, గుండె లయను నియంత్రించడం, ఆరోగ్యకరమైన నరాల పనితీరు వంటి ఇతర శరీర విధుల్లో కాల్షియం (calcium) కీలక పాత్ర పోషిస్తుంది. తగినంత కాల్షియం లేకపోవడం పిల్లలు,  పెద్దలలో అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. శరీరంలో కాల్షియం లోపం ( calcium deficiency )ఉందనడానికి కొన్ని సంకేతాలు ద్వారా  ముందుగానే తెలుస్తోంది. అలసిపోయినట్లు అనిపించడం, దంత సమస్యలు, పొడి చర్మం, కండరాల తిమ్మిరి  వంటి సమస్యలుంటే.. కాలిష్యం లోపం ఉందని గుర్తించాలని నిపుణులు చెబుతున్నారు.

“సాధారణంగా.. థైరాయిడ్, జుట్టు రాలడం, కీళ్ల నొప్పులు, జీవక్రియలో ఇబ్బందులు, హార్మోన్ల సమస్యలు, హెచ్‌ఆర్‌టి (హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ)తో బాధపడుతున్న వ్యక్తులు, మైనోపాజ్ అనంతరం మహిళలు కాల్షియం లోపంతో బాధపడుతున్నారు” అని డాక్టర్ దీక్షా భావ్‌సర్ చెప్పారు.

కొన్ని సమయాల్లో విటమిన్ డి లేకపోవడం వల్ల కూడా కాల్షియం లోపం ఏర్పడుతుంది. ఫాస్ఫేట్, మెగ్నీషియం అయాన్‌లతో పాటు కాల్షియం పేగు శోషణను విటమిన్ డి సులభతరం చేస్తుందని. అయితే కాల్షియం లోపం ఏర్పడితే.. ఆహారం జీర్ణ సమయంలో ఇబ్బందులు ఏర్పడతాయని డాక్టర్ భావ్‌సర్ చెప్పారు.

“విటమిన్ D  శరీరం కాల్షియంను గ్రహించేలా చేస్తుంది. బలమైన ఎముకలు, దంతాలు , జుట్టును నిర్మించడానికి కాల్షియం అవసరం. ఆయుర్వేదం ప్రకారం , జుట్టు, గోర్లు, ఎముకలు, జుట్టు ఆరోగ్యం కాల్షియంపై ఆధారపడి ఉంటుంది. కాల్షియం కండరాల సంకోచాలు, నరాల పనితీరు , హృదయ స్పందనలను నియంత్రిస్తుంది. రక్తం గడ్డకట్టడంలో కూడా సహాయపడుతుంది” అని ఆయుర్వేద నిపుణుడు చెప్పారు.

విటమిన్ డి పొందడానికి కనీసం 20 నిమిషాలు సూర్యరశ్మిలో ఉండాలని డాక్టర్ భావ్‌సర్ చెప్పారు. దీనికి ఉత్తమ సమయం సూర్యోదయం, సాయంత్రం (సూర్యాస్తమయం సమయం) అని ఆమె చెప్పారు.

డాక్టర్ దీక్షా భావ్సర్ ప్రకారం కాల్షియం అధికంగా ఉండే నాలుగు సహజ ఆహారాలు: 

1. ఉసిరి

ఉసిరికాయలో విటమిన్ సి, ఐరన్ , కాల్షియం పుష్కలంగా ఉన్నాయి. మీరు దీన్ని ఏ రూపంలోనైనా తీసుకోవచ్చు- పచ్చి పండ్లు, రసం, పొడి, షర్బత్ ఇలా ఏ రకంగా తీసుకున్నా ఆరోగ్యానికి మేలు. అయితే ఉసిరి రుచిలో పుల్లగా ఉంటుంది.  కాబట్టి, కీళ్ల నొప్పులు ఉన్నవారు ఉసిరిని తినమని సిఫార్సు చేయరు.

2. మునగాకు: 

మునగాకు ఆకులలో కాల్షియం, ఐరన్, విటమిన్లు ఎ, సి, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో 1 స్పూన్ మునగాకు ఆకుల పొడిని తీసుకోండి. అయితే వేడి నిచ్చే సహజం గుణం కలిగి ఉంది. కనుక మునగాకు తీసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

3. నువ్వులు

సుమారు 1 టేబుల్ స్పూన్ నలుపు/తెలుపు నువ్వులను తీసుకుని వేయించి.. దానిలో టీస్పూన్ బెల్లం, నెయ్యిని కలిపి ఉండాలా చుట్టుకోవాలి.  కాల్షియం స్థాయిలను పెంచడానికి ఈ పోషకమైన నువ్వుల లడ్డుని క్రమం తప్పకుండా తీసుకోండి.

4. పాలు

శరీరం సులభంగా గ్రహించే కాల్షియం ఇచ్చే ఉత్తమ ఆహారం పాలు. రోజూ ఒక గ్లాసు పాలు తాగడం వల్ల మీ కాల్షియం సమస్యలను దూరం చేస్తుంది.

(Note: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఇక్కడ అందించడం జరిగింది. ఏదైనా సందేహాలుంటే వైద్య నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది.)

Also Read: Hanuman Jayanthi: కోరిన కోర్కెలు తీరాలంటే.. హనుమాన్ జయంతి రోజున ఏ రాశివారు ఏ ప్రసాదం సమర్పించాలంటే..