Food Poisoning Problem: ఉరుకుల పరుగుల జీవితంలో మనం సమయానికి దొరికింది ఏది పడితే అది తింటుంటాం. వాటిలో ఫాస్ట్‌ఫుడ్‌తోపాటు అనేక రకాల ఆహార పదార్థాలు ఉంటాయి. అయితే.. కొన్ని ఆహారపు అలవాట్ల వల్ల కొన్నిసార్లు అనారోగ్యం బారిన పడే అవకాశముంది. శరీరానికి పడని ఆహారం తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశముంది. ఈ క్రమంలో వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, మంట, గ్యాస్ట్రిక్ సమస్యలు లాంటివి (food poisoning symptoms) తలెత్తుతాయి. ఇలాంటి సమయంలో వాంతులు, కడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు వైద్యుని సలహాతో పాటు, ఇంటి చిట్కాల సాయం కూడా తీసుకోవచ్చు. ఫుడ్ పాయిజనింగ్ అయినప్పుడు పాటించే హోమ్ రెమిడీస్ గురించి (Health Care Tips) ఇప్పుడు తెలుసుకుందాం..
నిమ్మకాయ: ఇందులో చాలా ఔషధ గుణాలున్నాయి. ఇది అనేక కడుపు సమస్యలను నయం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఒక గ్లాసు నీటిలో సగం నిమ్మకాయ రసం, కొద్దిగా నల్ల ఉప్పు కలిపి తీసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. నిమ్మకాయతో ఫుడ్ పాయిజనింగ్ బ్యాక్టీరియాను దూరం చేయవచ్చు.
వెనిగర్: నిపుణుల అభిప్రాయం ప్రకారం.. యాపిల్ సైడర్ వెనిగర్ జీవక్రియను పెంచే లక్షణాలను కలిగి ఉంటుంది. వెనిగర్ వాటర్ తాగడం వల్ల శరీరంలోని చెడు మూలకాలు బయటకు వెళతాయి. ఇలాంటి సమయంలో ఫుడ్ పాయిజనింగ్ బాధిత వ్యక్తి త్వరగా కోలుకోవచ్చు.
తులసి ఆకులు: ఇందులోని ఔషధ గుణాలు ఉదర సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయి. ఫుడ్ పాయిజన్ అయినప్పుడు తులసిని పెరుగులో కలిపి తినాలి. కావాలంటే పెరుగు బదులు తులసి టీ కూడా తాగవచ్చు. దీంతో వెంటనే ఉపశమనం లభిస్తుంది.
పెరుగు: ఇందులోని యాంటీబయాటిక్ లక్షణాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. అలాగే ఫుడ్ పాయిజనింగ్ సమయంలో పెరుగు తీసుకోవడం వల్ల చాలా ఉపశమనం లభిస్తుంది. దీంతోపాటు పెరుగులో కాస్త నల్ల ఉప్పును కలిపి తీసుకుంటే చాలా మంచిది.
వాము – జీలకర్ర: కడుపులో మంట, గ్యాస్ ఉంటే వాము, జీలకర్ర పొడిని నీళ్లల్లో కలుపుకొని తీసుకోవాలి. దీంతో వెంటనే ఉపశమనం లభిస్తుంది. దీని కోసం ముందుగా వాము, జీలకర్ర గింజలను కొద్ది వేయించి పొడి చేయాలి. ఈ పొడిని నీటిలో వేసి దానిలో కొంచెం నల్ల ఉప్పు కలిపి తీసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
Also Read: