Mint Leaves: ఆరోగ్యంతో పాటు అందం… పుదీనాతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..

Benefits With Mint Leaves: మనం నిత్యం అందుబాటులో ఉండే ఆకుకూరల్లో పుదీనా ఒకటి. అయితే కొత్తమీర వాడినంతగా పుదీనాను ఉపయోగించరు. ప్రత్యేకించి కొన్ని వంటల్లోనే పుదీనాను వాడుతుంటారు. కానీ పుదీనాతో కలిగే..

Mint Leaves: ఆరోగ్యంతో పాటు అందం... పుదీనాతో కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..

Updated on: Feb 03, 2021 | 5:45 AM

Benefits With Mint Leaves: మనం నిత్యం అందుబాటులో ఉండే ఆకుకూరల్లో పుదీనా ఒకటి. అయితే కొత్తమీర వాడినంతగా పుదీనాను ఉపయోగించరు. ప్రత్యేకించి కొన్ని వంటల్లోనే పుదీనాను వాడుతుంటారు. కానీ పుదీనాతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే మాత్రం వాటిని ఎట్టి పరిస్థితుల్లో వదలిపెట్టారు. కేవలం ఆరోగ్యమే కాకుండా అందాన్ని కూడా అందించే పుదీనాతో కలిగే ఉపయోగాలేంటో ఇప్పుడు చూద్దాం…

* కడుపునొప్పితో బాధపడితే పుదీనా ఆకుల రసంలో కాస్త తేనె కలిపి తాగితే మంచి ఫలితం లభిస్తుంది.

* ఎడతెరపి లేని దగ్గుతో బాధపడుతున్నారా. అయితే పుదీనా రసంలో కొంచెం బ్లాక్‌ సాల్ట్‌ కలిపి తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది.

* మౌత్‌ ఫ్రెషనర్‌గా పుదీనా ఎంతో క్రీయా శీలకంగా పనిచేస్తుంది. కాబట్టి చూయింగ్‌ గమ్‌లను పక్కన పెట్టి పుదీనాను ఉపయోగించండి.

* పుదీనాను క్రమం తప్పకుండా మెనూలో ఓ భాగం చేసుకుంటే… కడుపునొప్పి, పొట్ట ఉబ్బరం, గ్యాస్‌ వంటి సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు.

* కేవలం ఆరోగ్యమే కాకుండా పుదీనాతో అందం కూడా సొంతం చేసుకోవచ్చు. ముఖం కాంతివంతంగా మారాలంటే.. పుదీనా ఆకుల్ని మిక్సీలో వేసి, ఆ పేస్ట్‌ని ముఖానికి పెట్టుకొని.. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి.

* మొటిమలు, మచ్చలతో బాధపడుతున్నారా.? అయితే పుదీనా రసాన్ని వాటిపై రాస్తే త్వరగా తగ్గుతాయి.

Also Read: కరోనా మహమ్మారి ఫుణ్యమాని ఫైజర్ పంటపండుతోంది. ఈ ఏడాది కోవిడ్ వ్యాక్సిన్ అమ్మకం ద్వారా వచ్చే ధనరాశులెన్నో తెలుసా?